How Much Luggage Is Allowed in A Train Per Person in India: రైలు ప్రయాణికులకు ముఖ్యమైన వార్త. రైలు ప్రయాణంలో, ప్రయాణికులు నిర్ణీత ఉచిత అలవెన్స్ పరిమితికి మించి లగేజీని తీసుకెళ్లినప్పుడు ఇప్పుడు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రకటనను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో చేశారు. ప్రస్తుతం, రైలు కోచ్ లోపల ప్రయాణికులు తమతోపాటు లగేజీని తీసుకెళ్లడానికి క్లాస్‌ను బట్టి గరిష్ట పరిమితి నిర్ణయించారు. సెకండ్ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికులకు 35 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. 70 కిలోల వరకు లగేజీని ఛార్జీ చెల్లించి తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ఉచిత అలవెన్స్ 40 కిలోలు, గరిష్టంగా 80 కిలోలు. ఏసీ త్రీ టైర్ లేదా చైర్ కార్‌లో ప్రయాణించే ప్రయాణికులకు 40 కిలోల ఉచిత అలవెన్స్ లభిస్తుంది. ఇది గరిష్ట పరిమితి. ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టైర్ ప్రయాణికులకు 50 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. గరిష్ట పరిమితి 100 కిలోలు. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 70 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అయితే 150 కిలోల వరకు ఛార్జీ చెల్లించి తీసుకెళ్లవచ్చు.
ఎక్కువ లగేజీకి ఛార్జీ చెల్లించాలి
వైష్ణవ్ మాట్లాడుతూ, "ప్రస్తుతం, కోచ్ లోపల ప్రయాణికులు ఎంత లగేజీని తీసుకెళ్లవచ్చో గరిష్ట పరిమితి నిర్ణయించాం." రైల్వే మంత్రి తన రాతపూర్వక సమాధానంలో పంచుకున్న సమాచారం ప్రకారం, సెకండ్ క్లాస్ ప్రయాణికులకు 35 కిలోల వరకు లగేజీని ఉచితంగా, 70 కిలోల వరకు లగేజీని రుసుము చెల్లించి తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.
తత్కాల్ టికెట్స్ బుకింగ్‌లో ఓటీపీ సిస్టమ్ విస్తరణ
తత్కాల్ టికెట్స్ ఎక్కువ మంది ఏజెంట్‌లు బుక్ చేస్తున్నారు. దీని వల్ల సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఏజెంట్‌ల వద్దే ఎక్కువ ధరకు ఆ టికెట్స్ కొనాల్సి వస్తోంది. వీటిని నివారించడానికి రైల్వే శాఖ ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేసింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఓటీపీ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. ఇది ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తోంది. ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే మీరు మీ ఆధార్‌కార్డుతో లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్‌తో ఉన్న మొబైల్ మీతో ఉంచుకోవాల్సి ఉంటుంది. దానికి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడే తత్కాల్ టికెట్ బుక్ అవుతుంది.
ఆన్‌లైన్ రిజర్వేషన్ కౌంటర్‌లో కానీ, మీరు ఐఆర్‌సీటీసీలో కానీ తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకుంటే మాత్రం కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పటికే అన్ని ఐఆర్టీసీ అకౌంట్స్‌ను ఆధార్‌కు అనుసంధానం చేశారు. ఒక్కో అకౌంట్ నుంచి పరిమితికి మించిన టికెట్స్ బుక్ కావడం లేదు. ఇప్పుడు ఓటీపీ వ్యవస్థ కారణంగా దళారీ వ్యవస్థ మరింత కంట్రోల్ అవతుందని అధికారులు భావిస్తున్నారు.
తత్కాల్ టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు ప్రయాణికుల మొబైల్‌కు ఒక OTP అంటే వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. ఈ పాస్‌వర్డ్ నమోదు చేసిన తర్వాతే టిక్కెట్ జారీ అవుతుంది. చాలా రైల్వే స్టేషన్‌ల మధ్య నడిచే ట్రైన్స్‌లలో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. దీన్ని మరిన్ని ట్రైన్స్‌కు వర్తింపచేస్తున్నారు.