ABP Network Ideas Of India 2023: ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు 2023 లైవ్‌ ఎక్కడ ఎలా చూడాలి?

న్యూ ఇండియా: లుకింగ్‌ ఇన్‌వర్డ్‌ రీచింగ్‌ అవుట్‌ థీమ్‌తో ABP Ideas of India Summit 2023 రెడీ అయింది. వ్యాపార దిగ్గజాలు, సాంస్కృతిక రాయబారులు, రాజకీయ నాయకుల ఆలోచనలు పంచుకోవడమే ఈ వేదిక లక్ష్యం.

Continues below advertisement

ABP Network Ideas Of India 2023: ఏబీపీ నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం "నయా ఇండియా: లుకింగ్ ఇన్‌వర్డ్, రీచింగ్ అవుట్" అనే థీమ్‌తో మరోసారి వచ్చింది. న్యూ ఇండియా అనే భావనను రూపొందించడానికి వివిధ రంగాలకు చెందిన వక్తలను ఒకచోట చేర్చే వార్షిక సమావేశం ఫిబ్రవరి 24, 25 తేదీలలో జరగనుంది. UK మాజీ ప్రధాని లిజ్ ట్రస్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నారాయణ మూర్తి, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఏక్నాథ్ షిండే, భగవంత్ మాన్, బాలీవుడ్ దిగ్గజాలు జీనత్ అమన్, ఆశా పరేఖ్, మ్యూజిక్, సోషల్ మీడియాలను ప్రభావితం చేసిన ప్రముఖులు వ్యక్తులు, విద్యావేత్తలు సహా అనేక మంది ఈ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023లో పాల్గోనున్నారు. ఈ వేదిక నుంచి 'నయా ఇండియా' గురించి తమ ఆలోచనలను పంచుకోనున్నారు. 

Continues below advertisement

ప్రపంచాన్ని ఎన్నో సమస్యలు షేక్ చేస్తున్నాయి. అస్థిరపరిచే మరెన్నో ఇబ్బందులు రోజూ మనం చూస్తున్నాం. మరెన్నో ఇతర సమస్యలు రోజు వారి కార్యకలాపాలను ఆటంక పరుస్తున్నాయి. ప్రతికారం కోసం ఎదురు చూసే ఎన్నో అసాంఘిక శక్తులు ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. ప్రభుత్వాలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తూ వికటహట్టాసం చేస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నాయి. ఇదేసమయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సైన్స్ ప్రపంచ హద్దులను చెరిపేసి దగ్గర చేసింది. ఇది రెండువైపుల పదును ఉన్న కత్తిలా మారుతోంది. ఇలాంటి టైంలో సమస్యలు చర్చించి భవిష్యత్ భారతావని రూపకల్పనకు చేపట్టాల్సిన చర్యలు చర్చించేందుకు ABP Network Ideas Of India 2023 మీ ముందుకు వస్తోంది. వచ్చే ఏడాది భారత్‌ దేశం మరో జనరల్‌ ఎలక్షన్‌ను ఎదుర్కోనుంది. అలాంటి కీలకమైన తరుణంలో వార్షిక శిఖరాగ్ర సమావేశంలో వస్తోంది. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో భారత్‌ గమనం ఎలా ఉండాలి. ఎలాంటి ఆలోచనలతో ఉంటే నవభారత నిర్మాణం సాధ్యమవుతుందనే ఆలోచలను చేయబోతోంది ABP Network Ideas Of India 2023. ఇక్కడకు వచ్చిన వక్తలంతా దీనిపైనే ఫోకస్ చేయనున్నారు. తమ ఆలోచనలు పంచుకోనున్నారు. 

ABP Network Ideas Of India 2023 సమ్మిట్‌ ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి?

ABP Network Ideas Of India 2023 సమ్మిట్‌ ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారు.?
ABP Network Ideas Of India 2023 సమ్మిట్‌ ఫిబ్రవరి 24(శుక్రవారం), ఫిబ్రవరి 25(శనివారం) జరగనుంది. 

ABP Network Ideas Of India 2023 సమ్మిట్‌ ఎక్కడ ఎలా చూడాలి?
ABP Network Ideas Of India 2023 సమ్మిట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ను ABP Live YouTubeలో చూడవచ్చు
ABP Network Ideas Of India 2023 సమ్మిట్‌ చర్చలను ఎప్పటికప్పుడు ABP Network's Television ఛానల్స్‌లో కూడా ప్రచారం అవుతాయి. అక్కడ కూడా చూడవచ్చు.  

ABP Network Ideas Of India 2023 సమ్మిట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌ ఏబీపీ దేశం వెబ్‌సైట్‌, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ Facebook | Twitter | Instagram ఫాలో అయి తెలుసుకోవచ్చు. 

ABP Network, Ideas Of India, Ideas of India Live, Ideas of India Summit 2023, Ideas of India by ABP Network, Ideas of India 2023, Ideas of India Second Edition, Ideas of India 2.0, 

Continues below advertisement