ABP Network Ideas of India Summit 2023: ABP నెట్ వర్క్ తన ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ రెండో ఎడిషన్ ను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. 2023 ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సమ్మిట్ లో న్యూ ఇండియా అంటే ఏంటి, ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న భారత్ 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలంటే ఎలాంటి కార్యాచరణ అవసరం అనే అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఆ సమయం నాటికి భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. రెండు రోజుల పాటు జరిగే సమ్మిట్ లో పలువురు స్పీకర్లు వారి ఆలోచనల గురించి మాట్లాడనున్నారు.
ABP నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ను డాబర్ వేదిక్ టీ కో ప్రెజెంట్ చేస్తుండగా, డాక్టర్ ఆర్థో, గల్లంత్ అడ్వాన్స్, రాజేష్ మసాలాకో-పవర్ చేస్తోంది. ఈ రెండు రోజుల సమ్మిట్ లో కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మన్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి లిజ్ ట్రస్, రచయిత జావెద్ అక్తర్, గాయకులు లక్కీ అలీ, శుభా ముద్గల్, ఆథర్ అమితవ్ ఘోష్, దేవ్ దత్ పట్టానాయక్, నటి సారా అలీ ఖాన్, జీనత్ అమన్, నటులు ఆయుష్మాన్ ఖురానా, మనోజ్ వాజ్ పేయీ, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, క్రీడాకారులు గుప్తా జ్వాలా, వినేష్ ఫోగట్ సహా ఇతర ప్రముఖులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోనున్నారు.
ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ను ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తో పాటు ఇతరులు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం భవిష్ అగర్వాల్ ఓలా క్యాబ్స్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్ లో పని చేసిన భవిష్ అగర్వాల్ 2011 లో తన స్నేహితుడు అంకిత్ భాటితో కలిసి బెంగళూరులో ఓలాను స్థాపించారు. మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్న సమయంలోనే ఆయన రెండు పేటెంట్స్ పొందారు. అలాగే అంతర్జాతీయ జర్నల్స్ లో మూడు పేపర్లు పబ్లిష్ చేశారు.
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ హబ్ స్థాపించాలన్న ప్రణాళికల్లో ఉంది. దాదాపు రూ.7,610 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి తన సప్లై చైన్ ను లోకలైజ్ చేయాలని ప్రణాళిక వేసుకుంది. ఆగస్టు 2022 లో భవిష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్లు గతంలో ప్రకటించారు. సింగిల్ ఛార్జింగ్ తో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఈవీ కారును తీసుకువస్తామన్నారు. 2024 సంవత్సరం నాటికి కొత్త తరహా ఓలా ఈవీ కారును రోడ్లపై చూడొచ్చని అప్పుడే భవిష్ అగర్వాల్ ప్రకటించారు. ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ లో భాగంగా ఓలా కో - ఫౌండర్ భవిష్ అగర్వాల్ తన ఓలా జర్నీ ఓలా సాగిందో వివరించనున్నారు. ఇండియాలోనే మొట్టమొదటి రైడింగ్ తరహా కంపెనీ స్థాపించడంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను గురించి వివరించనున్నారు.