Shubhanshu Shukla : శుభాన్షు శుక్లా 18 రోజులు అంతరిక్షంలో గడిపిన తర్వాత భూమికి తిరిగి వచ్చారు. శుభాన్షుతో సహా 4 మంది వ్యోమగాములు  స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో తిరిగి వచ్చారు. అందరూ సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ మంగళవారం, జులై 15న భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:01 గంటలకు కాలిఫోర్నియాలో ల్యాండ్ అయింది. ఈ బృందం అంతరిక్షంలో దాదాపు 60 ప్రయోగాలు చేసిందని సమాచారం,

శుభాన్షు శుక్లా మొదట ఫుట్‌బాల్‌లో చాలా ఆసక్తి చూపించారని మీకు తెలుసా?సిటీ మాంటిస్సోరి పాఠశాలలో శుభాన్షు శుక్లా తిరిగి వచ్చినప్పుడు, లక్నో మొత్తం అతని గౌరవార్థం జాతీయ జెండాలను చేతిలో పట్టి శుభాకాంక్షలు చెప్పింది. శుభాన్షు శుక్లా టీచర్ మాట్లాడుతూ..."శుభాన్షు తన పాఠశాల రోజుల్లో చదివేటట్టు కనిపించకపోయినా మంచి మార్కులు సాధించేవారు. ఆయన ఇంత మంచి మార్కులు ఎలా తెచ్చుకుంటాడో అందరూ ఆశ్చర్యపోయేవారు. శుభాన్షు క్రీడల్లో ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో ఆసక్తి చూపేవారు. అతను క్రికెట్ కూడా ఆడేవారు. శుభాన్షు ఎన్‌డిఎలో దరఖాస్తు చేసుకున్నప్పుడు, తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వద్దని చెప్పారు"

మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శుభాన్షుశుభాన్షు శుక్లా 10 అక్టోబర్ 1985న లక్నోలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. శుభాన్షు వ్యోమగామి అయ్యే దిశగా ముందుకు సాగుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ ఒక ఎయిర్‌షో ఈ రంగంపై ఆయన ఆసక్తిని పెంచింది. శుక్లా చిన్నతనంలో ఒక ఎయిర్‌షో చూశాడు, అక్కడ విమానం వేగం, దాని శబ్దం విని ఆశ్చర్యపోయాడు శుభాన్షు.

మొదట నేషనల్ డిఫెన్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకున్నప్పుడు తిరస్కరణకు గురయ్యారు. వయస్సు ఎక్కువ ఉందని దరఖాస్తును తిరస్కరించారు. 2006లో ఆయన భారత వైమానిక దళంలో నియమితులయ్యారు  ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో M.Tech డిగ్రీని పొందారు. ఆయనకు మిగ్-29, డోర్నియర్ 228 వంటి అధునాతన ఫైటర్ జెట్‌లను నడిపిన అనుభవం ఉంది. 2019లో, ఆయన ఇస్రో 'ఇండియన్ హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్ ప్రోగ్రామ్' కోసం ఎంపికయ్యారు. వ్యోమగామి శిక్షణ కోసం ఎంపికైన నలుగురు అభ్యర్థులలో శుక్లా ఒకడు.