అన్వేషించండి

Voter ID Card: ఓటర్‌ ఐడీ కార్డులో చిరునామాను ఆన్‌లైన్‌లో సింపుల్‌గా ఎలా మార్చుకోవాలి? పూర్తి ప్రక్రియ ఇదే

Voter ID Card Address Change Online: ఇల్లు మారినట్లయితే మీ ఓటరు IDలో కొత్త చిరునామాను అప్‌డేట్ చేయాలి. లేకుంటే మీరు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Voter ID Card Address Change Online: భారత్‌లో నివసించడానికి అనేక పత్రాలు అవసరం. ఇవి వివిధ ప్రయోజనాలు కల్పిస్తుంటాయి. ఇలాంటి వాటిలో ఓటరు గుర్తింపు కార్డు కూడా చాలా ముఖ్యమైంది. భారత ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తుంది. మీరు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఓటు వేయడానికి అర్హులు అవుతారు. అప్పుడు మీరు ఓటు హక్కుతోపాటు ఐడీ కార్డు కూడా పొందుతారు.  

కానీ కార్డులో చిరునామా, పేరు లేదా జెండర్‌ నమోదులో తప్పులు ఉంటే సరి చేసుకోవాలి. లేకుంటే ఓటు వేసేటప్పుడు, లేదా ఏదైనా గుర్తింపు కోసం ఆ కార్డు చూపించినప్పుడు సమస్యలు వస్తాయి. ఇలాంటి లోపాలు సరి చేసుకోవాలంటే ఇప్పటి వరకు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఆ శ్రమ లేదు. భారీ క్యూలలో నిలబడాల్సిన అవసరం అంతకంటే లేదు. మొత్తం అప్‌డేట్‌ ప్రక్రియను డిజిటలైజ్ చేశారు. ఇంటిలోనే కూర్చొని మీరు మీ ఓటర్ ఐడీ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియల ఎలాగో తెలుసుకోండి.

ఏ పత్రాలు అవసరం?

18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న, చెల్లుబాటు అయ్యే చిరునామా ప్రూఫ్‌ కావాలి. ఈ ప్రూఫ్స్‌ ఉన్న వారు ఎవరైనా సరే ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్  కచ్చితంగా అప్‌లోడ్ చేయాలి. గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్‌, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్‌ అవసరం అవుతాయి. విద్యుత్ బిల్లు, నీటి బిల్లు లేదా బ్యాంక్ పాస్‌బుక్‌ను అడ్రస్‌ ప్రూఫ్‌గా సబ్‌మిట్ చేయవచ్చు. ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో కూడా అవసరం అవుతుంది. దరఖాస్తులో ఆలస్యం లేకుండా ప్రక్రియ సులభంగా అయ్యేందుకు ఈ పత్రాలు క్లియర్‌గా ఉండాలి. లేటెస్ట్ సర్టిఫికెట్స్ ఉంటే మరీ మంచిది.  

మీ చిరునామాను ఆన్‌లైన్‌లో ఎలా మార్చాలి 

మీ ఓటరు ఐడిలోని చిరునామా తప్పుగా ఉంటే, దానిని ఆన్‌లైన్‌లో సరి చేసుకోవచ్చు. దీని కోసం, ఓటరు సేవల పోర్టల్‌కు వెళ్లి ఫారమ్ 8 ఫిల్ చేయాల్సి ఉంటుంద. సరైన సమాచారాన్ని నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి. సమర్పించిన తర్వాత, మీకు ట్రాకింగ్ నంబర్‌ వస్తుంది. ఆ ట్రాకింగ్ నెంబర్‌తో అప్లికేషన్ స్టాటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు  మీకు కేటాయించిన బిఎల్‌ఓను సంప్రదించాలి. ఫారమ్ 8 నింపి, పైన పేర్కొన్న డాక్యుమెంట్స్‌ జిరాక్స్‌‌లను అటాచ్ చేసి దరఖాస్తు సమర్పించారు. ఆన్‌లైన్ ప్రక్రియ ఆఫ్‌లైన్ ప్రక్రియ కంటే చాలా సులభమైంది. 

ఎంత సమయం పడుతుంది?

ఓటరు ఐడిని పొందడానికి లేదా సరిదిద్దడానికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రక్రియలు రెండూ పూర్తిగా ఉచితంగానే లభిస్తాయి. దరఖాస్తును సమర్పించిన తర్వాత, సంబంధిత అధికారులు పత్రాలను చెక్ చేసి వాటిని వెరిఫై చ్సాతుర. ప్రతిదీ సరిగ్గా ఉందని తేలితే ఓకే చెబుతారు. దీంతో మీరు అప్‌డేట్ చేసిన వివరాలతో కొత్త కార్డు జారీ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా కొన్ని వారాలు పట్టవచ్చు. కాబట్టి, మీరు మీ అడ్రస్‌ మారిన వెంటనే ఓటర్ ఐడీలో కూడా చిరునామాను అప్‌డేట్ చేసుకోవడం చాలా మంచిది. లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  

Frequently Asked Questions

ఓటరు గుర్తింపు కార్డులో చిరునామాను ఆన్‌లైన్‌లో ఎలా మార్చాలి?

మీరు ఓటరు సేవల పోర్టల్‌కు వెళ్లి ఫారమ్ 8 నింపాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, దరఖాస్తును సమర్పించాలి. మీకు ట్రాకింగ్ నంబర్‌ వస్తుంది, దానితో అప్లికేషన్‌ స్థితిని తనిఖీ చేయవచ్చు.

ఓటరు గుర్తింపు కార్డును అప్‌డేట్‌ చేయడానికి ఏ పత్రాలు అవసరం?

గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి అవసరం. చిరునామా రుజువు కోసం విద్యుత్ బిల్లు, నీటి బిల్లు లేదా బ్యాంక్ పాస్‌బుక్‌ను సమర్పించవచ్చు. ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో కూడా కావాలి.

ఓటరు గుర్తింపు కార్డును పొందడానికి లేదా సరిదిద్దడానికి ఎంత సమయం పడుతుంది?

దరఖాస్తును సమర్పించిన తర్వాత, అధికారులు పత్రాలను పరిశీలించి, ధృవీకరిస్తారు. ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా కొన్ని వారాలు పట్టవచ్చు.

ఓటరు గుర్తింపు కార్డును అప్‌డేట్‌ చేయడానికి ఏదైనా రుసుము చెల్లించాలా?

ఓటరు ఐడిని పొందడానికి లేదా సరిదిద్దడానికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రక్రియలు రెండూ పూర్తిగా ఉచితం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Petrol Manufacturing Process:పెట్రోల్ బంక్ వరకు చేరే ఇంధనం వెనుక రహస్యాలేంటి? ముడి చమురు నుంచి పెట్రోల్ తయారీ ప్రక్రియ ఏంటీ?
భూమిలోంచి మీ బైక్‌ ట్యాంక్ వరకు... ఆ నల్ల బంగారం పెట్రోల్‌గా ఎలా మారుతుందో తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
కొత్త పార్టీతో వచ్చేసిన శశికళ - తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు
LPG Gas Booking : గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Advertisement

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం - పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యక్రమం
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Womens History Month.. తీర్మానంపై ట్రంప్ సంతకాలు
Ustaad Bhagat Singh Ticket Rates : ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ పెంపు - బెనిఫిట్ షో టైమింగ్స్ ఇవే!
Farmer admired by CM Chandrababu: ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
ప్రకృతి సేద్యపు ఋషి - 75 సెంట్లలో 52 పంటల అద్భుతం - చంద్రబాబు మెచ్చిన రైతు రోశయ్య
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
KTR Letter to Amit Shah: రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
రేవంత్ రెడ్డి బినామీ అక్రమాల కేటీఆర్ ఆరోపణలు - అమిత్ షాకు లేఖ- సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
Embed widget