Gyanvapi Mosque Case: 



సుప్రీంకోర్టులో పిటిషన్ 


జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజీ సర్వేకి అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. తీర్పుకి వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసింది. మసీదులో సర్వేని అడ్డుకోవాలని మసీద్ కమిటీ తరపున న్యాయవాది కోర్టుకి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం "పరిశీలిస్తాం" అని సమాధానమిచ్చింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఈమెయిల్ కూడా పంపినట్టు మసీద్‌ కమిటీ తరపున అడ్వకేట్ నిజాం పాషా వెల్లడించారు. ఇటు హిందువుల వైపు నుంచి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఎలాంటి తీర్పు ఇవ్వకూడదని పిటిషనర్ రాఖీ సింగ్ కోర్టుని కోరారు. ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.