Gadchiroli Naxal : గడ్చిరోలిలో (Gadchiroli) మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు (Mallojula Venugopal Rao) పెద్ద ఎత్తున లొంగిపోవడంతో మావోయిస్టు రహిత మహారాష్ట్ర సాధ్యమయ్యే అవకాశాలు మరింత పెరిగాయి. మావోయిస్టుల (Naxal) సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు , అత్యంత సీనియర్ నక్సల్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ భూపతి తన 60 మంది సహచరులతో కలిసి గడ్చిరోలి పోలీసుల (Gadchiroli Police) ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్ర నుంచి మావోయిజం త్వరలో అంతమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) సమక్షంలో ఈ లొంగుబాటు కార్యక్రమం గడ్చిరోలిలో జరిగింది. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను ముఖ్యమంత్రికి సమర్పించగా...ముఖ్యమంత్రి వారికి రాజ్యాంగ ప్రతిని అందించారు.
Gadchiroli Naxal : 1980 నుండి గడ్చిరోలిలో మావోయిస్టు సాయుధ పోరాటం, 538 మంది సాధారణ పౌరుల బలిదానం
ఇదే సమయంలో, 1980 నుండి గడ్చిరోలిలో ప్రారంభమైన మావోయిస్టు సాయుధ పోరాటంలో ఇప్పటివరకు మావోయిస్టులు 538 మంది సాధారణ పౌరుల ప్రాణాలు తీశారు. అలాగే 'సాయుధ మావోయిజం మార్గాన్ని వదిలి, ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపి ప్రధాన స్రవంతిలోకి రావాలి' అని మావోయిస్టు నాయకుడు సోను అలియాస్ భూపతి అన్నారు. ఇప్పుడు ఆయనతో పాటు 60 మందికి పైగా సహచరులు గడ్చిరోలి పోలీసుల (Gadchiroli Police) ఎదుట లొంగిపోయారు, దీనివల్ల మహారాష్ట్ర నుంచి మావోయిజం త్వరలో అంతమయ్యే అవకాశం ఉంది.
Devendra Fadnavis : ముఖ్యమంత్రి భూపతి విషయంలో పోలీసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు
భూపతి లొంగిపోవచ్చు, కానీ ఆయన తెలంగాణాలో లొంగుతాడు లేదా ఛత్తీస్‌గఢ్‌లో లొంగుతాడా అని భావిస్తున్న సమయంలో, భూపతి మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోవడానికి అంగీకరించాడు. గత కొన్ని రోజులుగా మధ్యవర్తుల ద్వారా భూపతి ,ఆయన సహచరులతో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి లొంగిపోవడం , ఆయుధాలు వదిలి సమాజంలోకి రావడం వల్ల కలిగే ప్రయోజనాలను... పోలీసులు , వారి మధ్యవర్తులు వివరించడంలో విజయం సాధించారు. భూపతి లొంగిపోయే ముందు ఒక షరతు విధించాడు. అదేంటంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో మాత్రమే లొంగిపోతాను అన్నాడు. ముఖ్యమంత్రి కూడా భూపతి లొంగిపోయే నిర్ణయాన్ని ఆమోదించిన తర్వాత ఈ రోజు తన ప్రధాన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి మహారాష్ట్ర తరపున పోలీసులు .. వారి మధ్యవర్తులు భూపతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి గడ్చిరోలికి వెళ్లారు.
దేశంలో మావోయిజానికి చోటు లేదు..నక్సల్స్ ఫ్రీ భారత్ తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి ఫడ్నవీస్. లొంగిపోయిన నక్సల్స్ ని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు... ఈ సందర్భంగా కొందరికి చెక్ లు అందించారు ముఖ్యమంత్రి
నక్సల్స్ కోసం ఓ ముఖ్యమంత్రి అటవీ ప్రాంతానికి వెళ్లడం ఫస్ట్ టైమ్.. ఇంతమంది నక్సల్స్ ఒకేసారి లొంగిపోవడం కూడా ఇదే మొదటి సారి. దీనివెనుకున్న లక్ష్యం మహారాష్ట్ర నక్సల్ ముక్తి దిశగా అడుగులు వేయాలన్నదే.
మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్, 60 మంది మావోయిస్టులు... పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి