G20 Summit 2023:



G20 సదస్సుకి బైడెన్ 


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీకి వచ్చిన సమయంలో ఆయనకు ఆహ్వానం పలికే క్రమంలో కేంద్రం పెద్ద తప్పు చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయన ఎయిర్‌పోర్ట్‌లో దిగే సమయానికి అక్కడ అసందర్భమైన పాటను పెట్టి కించపరిచారని మండి పడుతున్నాయి. Ed Sheeran కంపోజ్ చేసి పాడిన Shape of You పాటని ప్లే చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేంద్రమంత్రులు బైడెన్‌ని ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పాటలు వినిపించాయి. అదే పాటకు స్టేజ్‌పై డ్యాన్సర్‌లు డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. జో బైడెన్‌ వచ్చినప్పుడే కాదు. అర్డెంటీనా ప్రెసిడెంట్ అల్బర్టో ఫెర్నాండెజ్ వచ్చినప్పుడూ ఇదే పాట వినిపించింది. అయితే...ఈ పాటని యాజిటీజ్‌గా కాకుండా ఇండియన్ మ్యూజిక్‌తో మిక్స్ చేసిన ఓ రెండిషన్‌ని ప్లే చేశారు. అయినా...అందులో లిరిక్స్ అభ్యంతరకరంగా ఉంటాయని, అలాంటి పాటను దేశాధినేతలు వచ్చినప్పుడు పెట్టడమేంటని కొందరు వాదిస్తున్నారు. వీళ్లకు కాంగ్రెస్ నేతలూ మద్దతు పలికారు. ఇది కచ్చితంగా అవమానమే అని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే ఈ పాటలోని లిరిక్స్‌ కూడా ట్విటర్‌లో షేర్ చేశారు. దేశాధినేతల్ని షేప్ ఆఫ్ యూ పాటతో వెల్‌కమ్ చేయడం దారుణం అని పోస్ట్ పెట్టారు. కొందరు నెటిజన్లు కూడా దీనిపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. చక్కగా మన ఇండియన్ పాటేదైనా పెట్టుకోవచ్చుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.