G20 Summit 2023: 



ఢిల్లీలో G20 సమ్మిట్..
 
సెప్టెంబర్ 9,10వ తేదీల్లో ఢిల్లీ వేదికగా G-20 సదస్సు (G20 Summit) జరగనుంది. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ సదస్సులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. వేలాది మంది పారామిలిటరీ సిబ్బంది ఢిల్లీకి చేరుకున్నారు. పోలీసులూ అన్ని చోట్లా పహారా కాస్తున్నారు. తనిఖీలు చేస్తున్నారు. ఈ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకూ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే...ఇవి పుకార్లేనని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ దేశాల అధినేతలు వస్తుండటం వల్ల ఆంక్షలు మాత్రమే విధించామని, లాక్‌డౌన్‌ పెట్టామన్న వార్తల్లో నిజం లేదని ఢిల్లీ పోలీస్ PRO సుమన్ నల్వా స్పష్టం చేశారు. 


"G20 సదస్సు జరిగే ప్రాంత పరిసరాల్లోని అన్ని దుకాణాలు, ఇతరత్రా కమర్షియల్ కాంప్లెక్స్‌ని మూడు రోజుల పాటు మూసివేయనున్నాం. ఢిల్లీ మెట్రోలనే ప్రజలు ప్రయాణించాలని కోరుకుంటున్నాం. కొన్ని ప్రాంతాలపై ఆంక్షలు విధిస్తాం. ఆ ప్రాంతాల్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ID కార్డ్‌లు చూపించాల్సిందే. నిత్యావసరాల పంపిణీపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు. లాక్‌డౌన్‌ ఉంటుందన్న వార్తల్లో నిజం లేదు. ఆ పుకార్లను దయచేసి నమ్మకండి"


- సుమన్ నల్వా, ఢిల్లీ పోలీస్ పీఆర్‌వో