Pahalgam Terror Attack: ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని దేశం ఇప్పట్లో మర్చిపోదు. ఈ దాడిలో 26 మంది మరణించగా, చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన తర్వాత, ప్రభుత్వం కఠినమైన చర్యలు దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. దర్యాప్తు సంస్థలు చురుగ్గా పని చేస్తున్నాయి. నిఘా దర్యాప్తు సంస్థలు జమ్మూ కశ్మీర్‌లోని స్థానిక ఉగ్రవాదుల జాబితా సిద్ధం చేశాయి. ఈ స్థానిక ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయం చేస్తారు. వారికి ఆశ్రయం ఇస్తారు, వనరులు సమకూరుస్తారు.  

పహల్గామ్ దాడి తర్వాత, భద్రతా దళాలు ఈ ఉగ్రవాదుల భరతంపట్టే పనిలో పడ్డారు. ఒక్కొక్కటిగా కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఆశ్రయం ఇచ్చిన వారి ఇళ్ళు నేలమట్టం చేస్తున్నారు. శనివారం పుల్వామా, కుల్గామ్‌లోని ఉగ్రవాదుల ఇళ్ళు IED పెట్టి పేల్చేశారు. ఇప్పుడు సైన్యం సర్వేలెన్స్‌లో 14 మంది ఉన్నారు,  

ఆదిల్ రెహ్మాన్ డెంటు లష్కరే తోయిబా (LeT) సోపోర్ కమాండర్. 2021 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. సోపోర్ జిల్లా కమాండర్. దర్యాప్తు సంస్థలు అతని కోసం వెతుకుతున్నాయి.  

జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ఉగ్రవాది ఆసిఫ్ అహ్మద్ షేక్ అవంతిపుర జిల్లా కమాండర్. అతను 2022 సంవత్సరం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నాడు.

ఎహ్సాన్ అహ్మద్ షేక్ పుల్వామాలో చురుకుగా ఉన్నాడు. లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాది. 2023 నుంచి నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. భద్రతా సంస్థలు అతని కోసం వెతుకుతున్నాయి.

హరీష్ నజీర్ పుల్వామాకు చెందిన ఉగ్రవాది , లష్కరే-ఎ-తోయిబాలో చురుకైన వ్యక్తి. అతను భద్రతా దళాల రాడార్‌లో ఉన్నాడు.

పుల్వామాలో చురుకైన ఉగ్రవాది అమీర్ నజీర్ వాని. జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం కలిగి ఉన్నాడు.

జెఇఎం ఉగ్రవాది యావర్ అహ్మద్ భట్ పుల్వామాలో చాలా యాక్టివ్‌గా ఉన్న ఉగ్రవాది. 

ఆసిఫ్ అహ్మద్ కాండే షోపియన్‌కు చెందిన ఉగ్రవాది. జులై 2015లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నాడు.

నసీర్ అహ్మద్ వాని షోపియన్‌లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. లష్కరే-ఎ-తోయిబాలో క్రియాశీల సభ్యుడు . పాకిస్తాన్ ఉగ్రవాదుల మద్దతుదారుడు.షాహిద్ అహ్మద్ కుటే షోపియన్‌లో కూడా చురుగ్గా ఉన్నాడు. లష్కరే-ఎ-తోయిబా, టిఆర్‌ఎఫ్‌లో సభ్యుడు. అతను 2023 సంవత్సరం నుంచిఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్నాడు.

అమీర్ అహ్మద్ దార్ స్థానిక ఉగ్రవాది. అతను 2023 నుంచి షోపియన్‌లో చురుగ్గా ఉన్నాడు. అతను లష్కరే-ఎ-తోయిబా, టిఆర్‌ఎఫ్‌తో దగ్గరగా పనిచేస్తున్నాడు.

షోపియన్ జిల్లాకు చెందిన అద్నాన్ సఫీ దార్ యాక్టివ్‌ ఉగ్రవాది. అతను 2024లో ఉగ్రవాద సంస్థలో చేరాడు. ప్రస్తుతం అతను లష్కరే-ఎ-తోయిబా టిఆర్‌ఎఫ్‌తో కలిసి పనిచేస్తున్నాడు.

జుబైర్ అహ్మద్ వాని అనంత్‌నాగ్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్ ఆపరేషనల్ కమాండర్. అతను యాక్టివ్‌ A+ ఉగ్రవాది. ఉగ్రవాదుల మద్దతుదారుగా విస్తృతంగా పనిచేస్తున్నాడు. ఈ ఉగ్రవాది 2018 నుంచి యాక్టివ్‌గా  ఉన్నాడు.

హరూన్ రషీద్ ఘని అనంత్‌నాగ్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది. కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ వెళ్లి, అక్కడ శిక్షణ పొందాడు. ప్రస్తుతం, భద్రతా దళాలు అతని కోసం వెతుకుతున్నాయి.

జుబైర్ అహ్మద్ ఘని కుల్గాంకు చెందిన పెద్ద ఉగ్రవాది. లష్కరే-ఎ-తోయిబాలో చేరిన భద్రతా దళాలపై దాడులు,  వారినే లక్ష్యంగా చేసే హత్యల్లో పాల్గొంటున్నాడు.