Thalapathy Vijay: ఆ ఒక్క సినిమాకు జయలలిత బ్రేక్! విజయ్ పొలిటికల్ ఎంట్రీ వెనుక స్టోరీ ఇదేనా !
TVK Vijay Politics | తన సినిమా విడుదల సమయంలో అప్పటి జయలలిత ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు, నష్టాలే విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణమని తమిళనాట చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలో ఉన్న తలపతి విజయ్ అసలు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటనే దానిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం దివంగత సీఎం జయలలితనే అంటారు తమిళనాడు రాజకీయాలు తెలిసిన వాళ్ళు. విజయ్ చేసిన ఒక్క సినిమాని అప్పట్లో జయ లలిత ప్రభుత్వం ఆపకుండా ఉండుంటే విజయ్ ఇంత త్వరగా రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదు అనేది వారి వాదన. అదే 2013 "తలైవా" మూవీ.
అసలేం జరిగిందంటే..!
రజనీకాంత్ కమలహాసన్ లాంటి దిగ్గజాలు వయసు దృష్ట్యా తాము చేసే సినిమాలు తగ్గించుకుంటున్న సమయంలో వరుస సైట్లతో విజయ్ తమిళనాడులో నెంబర్ వన్ స్టార్ గా ఎదుగుతున్న సమయం అది. పైగా తన సినిమాల్లో సామాజిక అంశాల పైన ఏదో ఒక పాయింట్ ఉండేలా విజయ్ జాగ్రత్త పడుతున్న టైం లో వచ్చిన సినిమానే "తలైవా ". AL విజయ్ డైరెక్షన్లో వచ్చిన "తలైవా "(నాయకుడు ) సినిమా భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధమైంది. ఆ సమయంలో జయలలిత తమిళనాడు సీఎం గా ఉన్నారు. తమిళనాడులో సినిమాలని రాజకీయాలని వేరువేరుగా చూడలేని సంప్రదాయం ఉంది కాబట్టి స్టార్ హీరోలు తమ సినిమాల్లో పెట్టే డైలాగ్స్ ని అక్కడి రాజకీయ పార్టీలు నిశితం గా గమనిస్తూ ఉంటాయి.
విజయ్ రాజకీయాల్లోకి ఎప్పటికైనా వస్తాడు అని ఆయన అభిమానులు చెబుతున్న టైం అది. దానికి తగ్గట్టే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాస్త రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తున్న సమయం లో వచ్చిన సినిమానే "తలైవా ". ఆ సినిమాలో సత్యరాజ్ అమలాపాల్ లాంటివాళ్ళు కీలక పాత్రలు పోషించారు. నిజానికి ఆ సినిమా హాలీవుడ్ క్లాసిక్ "గాడ్ ఫాదర్ " మణిరత్నం "నాయకుడు " ప్రేరణతో వచ్చిన కథ. పేద ప్రజలకు అండగా ఉన్న తన తండ్రిని చంపిన వారిపై కొడుకు ఎలా పగ తీర్చుకున్నాడనే మామూలు కథ. కానీ ఆ సినిమాకు పెట్టిన "తలైవా" అనే టైటిల్ దాని క్రింద ఇచ్చిన "టైం టూ లీడ్ " అనే ట్యాగ్ లైన్ అప్పటి జయలలిత ప్రభుత్వానికి తమనే టార్గెట్ చేస్తున్నారని అభిప్రాయాన్ని కలిగించింది.

దర్శకుడు ఏ ఎల్ విజయ్ తమ సినిమా రాజకీయాలకు సంబంధించింది కాదు అని క్లారిటీ ఇచ్చినా ప్రభుత్వం నమ్మలేదు. 9 ఆగస్టు 2013 న రిలీజ్ కావాల్సిన సినిమాను తమిళనాడు పుదుచ్చేరిలో బ్యాన్ అయ్యేలా ప్రభుత్వం కథ నడిపింది. ఈ సినిమా వల్ల లాండ్ & ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని ఓ కారణం చెప్పింది. అయితే ఢిల్లీ లాంటి చోట్ల ఈ సినిమా రిలీజ్ అయిపోవడంతో చూసిన ప్రేక్షకులు ఈ సినిమాకి రాజకీయాలకు సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. సమీక్షలు అలానే వచ్చాయి. అయినప్పటికీ తమిళనాడులో మాత్రం సినిమా రిలీజ్ కాలేదు. నాటికీయ పరిణామాల మధ్య కొన్ని థియేటర్లకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపుల ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ప్రభుత్వం వీటిని కూడా ఒక సాకుగా చూపింది.
టైటిల్ తమిళం లోనే పెట్టినా ఎంటర్టైన్మెంట్ టాక్స్ మినహాయింపు ఇవ్వకపోవడం తో అప్పటికే 10 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సినీ వర్గాలు అంచనా వేసాయి. చివరికి హీరో విజయ్ స్వయంగా ముఖ్యమంత్రి జయలలితను అడ్రస్ చేస్తూ రక్షణ కల్పించాలని సినిమా రిలీజ్ కి దారి ఇవ్వాలని కోరుతూ ఎమోషనల్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అలాగే తన అభిమానులని సంయమనం పాటించాలని కోరారు. చివరికి ఫైరసీ సీడీలు సైతం వచ్చేసాక 20 ఆగస్టు 2013 న ఈ సినిమా తమిళనాడు, పుదుచ్చేరి లో రిలీజ్ అయింది. విజయ్ ప్రధాన మార్కెట్ అంతా కూడా తమిళనాడు లోనే ఉంది. అక్కడే సినిమా దాదాపు రెండు వారాలు రిలీజ్ కాకుండా ఉండటం వేరే రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అయిపోవడంతో ఆ సినిమాను రకరకాల మాధ్యమాల్లో జనాలు చూసేసారు. దానితో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టం వచ్చింది.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ నిర్ణయానికి "తలైవా " నే కారణం!
విజయ్ రాజకీయ ప్రవేశానికి . "తలైవా "కాంట్రవర్సీనే కారణం అని ఆయన ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. అప్పట్లోనే రాజకీయాల్లోకి ఆయన వచ్చేయాలని పెద్ద ఎత్తున ప్రదర్శనలు కూడా జరిగాయి. కానీ అప్పటికైనా వయసు 40 ఏళ్ళ దగ్గరే ఉండడం కెరీర్ పరంగా స్టార్ డం పీక్లో ఉండడంతో ఆయన 11 ఏళ్లు గ్యాప్ తీసుకుని 2004లో టీవీకె పార్టీ తో జనం లోకి వచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రికార్డ్ సృష్టించారు. మొదటి నుంచి కామ్ గా ఉంటూ తన పని తాను చేసుకుపోయే వ్యక్తిగా ముద్రపడ్డ విజయ్ రాజకీయాల్లోకి వచ్చి తీరాల్సిందే అని నిర్ణయించుకునేలా చేసింది "తలైవా" ఘటన అని పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఆ ఒక్క సినిమానల్ విషయం లో అప్పటి జయలలిత ప్రభుత్వం చూసి చూడనట్టు ఊరుకుని ఉండి ఉంటే అసలు విజయ్ కి పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన ఉండేది కాదని ఉన్న ఇంత త్వరగా ఆ పని చేసి ఉండేవాడు కాదని తమిళనాట మరో చర్చ మొదలైంది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు





















