Farooq Abdullah News: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు జరిగాయి. తృటిలో తప్పించుకున్నారు. బుధవారం (మార్చి 11) జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన న్యాయవాది వివాహానికి అబ్దుల్లా హాజరయ్యారు. కమల్ సింగ్ జామ్వాల్ కాల్పులు జరిపాడు. అతన్ని వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఏం చెప్పారు?
ఈ ఘటనపై వ్యాఖ్యానిస్తూ, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా, "దేవుడు దయ వల్ల నా తండ్రికి తృటిలో ప్రమాదం తప్పింది. లోడ్ చేసిన పిస్టల్‌తో ఒక వ్యక్తి అతని దగ్గరగా వచ్చి కాల్పులు జరిపాడు. భద్రతా సిబ్బంది హత్యాయత్నాన్ని భగ్నం చేసింది. ప్రస్తుతం, సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, వాటిలో ఒకటి Z+ (NSG) భద్రతా దళాల రక్షణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి దుండగుడు ఎలా వెళ్లాడనేది అనేది అనుమానంగా ఉంది."
ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటపడింది.
కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడు కమల్ సింగ్ జామ్వాల్ జమ్మూ నివాసి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. వీడియోలో, నిందితుడు ఫరూక్ అబ్దుల్లా వద్దకు వెళ్లి కాల్పులు జరుపుతున్నట్లు చూడవచ్చు. అతను కాల్పులు జరపగానే, అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతన్ని అదుపు చేసి, లొంగదీసుకున్నారు.
జమ్ము కశ్మీర్ క్యాబినెట్ మంత్రి సతీష్ శర్మ ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ, ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని అన్నారు. ఫరూక్ అబ్దుల్లాకు సరైన భద్రత కల్పించాలని ఆయన అన్నారు. ఇది భద్రతా లోపం, కానీ పూర్తిగా క్షేమంగా ఉన్నారు.
ఫరూక్ అబ్దుల్లా, ఉప ముఖ్యమంత్రి చౌదరి, ముఖ్యమంత్రి సలహాదారు నాసిర్ అస్లాం వాని కార్య్రమం నుంచి బయటకు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి జామ్వాల్ పురానీ మండి ప్రాంతానికి చెందినవాడు. అతను పిస్టల్‌తో ఫరూఖ్ అబ్దుల్లా వద్దకు వచ్చి కాల్పులు జరిపాడు. జమ్ము కశ్మీర్ పోలీసు భద్రతా విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు - ఒక ఇన్‌స్పెక్టర్, ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ - అతని పట్టుకున్నారు. డిప్యూటీ సీఎం చౌదరి ఈ ఘటనను భద్రతా లోపంగా అభివర్ణించారు. వార్తా సంస్థ పిటిఐ ప్రకారం, దాడి సమయంలో 70 ఏళ్లు పైబడిన జామ్వాల్ మద్యం మత్తులో ఉన్నాడని అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది గన్‌ను లాక్కున్నారు. అంతకంటే ముందే అతను ఒక రౌండ్ కాల్పులు జరిపాడని చెప్పారు. అయితే, కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.
దాడి చేసిన వ్యక్తి విచిత్ర వాదన
నిందితులు చెబుతున్న కారణాలు ఆశ్చర్యపరిచాయి. దాదాపు 20 సంవత్సరాలుగా ఫరూక్ అబ్దుల్లాను హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నానని జామ్వాల్ పోలీసులకు చెప్పాడు. ఇది వ్యక్తిగత ఎజెండాగా చెబుతున్నారు. తన వద్ద ఉ్న పిస్తల్‌కు లైసెన్స్ ఉందని పేర్కొన్నాడు. అధికారుల ప్రకారం, ఫరూఖ్ అబ్దుల్లా, చౌదరి JKNC నాయకుడు BS చౌహాన్ కుమారుడి వివాహానికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. ఒక గంటకుపైగా వేదిక వద్ద ఉన్నారు. "జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా హాజరైన వివాహ కార్యక్రమంలో లైసెన్స్డ్ ఆయుధంతో కాల్పులు జరిపాడు. నిందితుడిని అరెస్టు చేశారు. సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఉగ్రవాద కుట్ర లేదు." అని సిటీ సౌత్ పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ శర్మ Xలో ఒక పోస్ట్‌లో తెలిపారు.
