Rahul Vs EC: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తాజా ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు చట్టం ప్రకారం అధికారిక ప్రకటనపై సంతకం చేయాలని లేదా "అసంబద్ధమైన ఆరోపణలు చేసినందుకు " దేశానికి క్షమాపణ చెప్పాలని ECI డిమాండ్ చేసింది.

"చట్టం ఒక నిర్దిష్ట విషయం ఒక నిర్దిష్ట పద్ధతిలో జరగాలని కోరితే, అది ఆ విధంగానే జరగాలి. మరే ఇతర పద్ధతిలో కాదు. అందువల్ల, రాహుల్ గాంధీ తన ఆరోపణలపై నమ్మకం ఉంటే ECIపై తప్పులు చేసిందనివిశ్వసిస్తే, చట్టం పట్ల గౌరవం కలిగి ఉండాలి. అలా చెప్పే ప్రకటనపై సంతకం చేయాలి లేదా ECIపై అసంబద్ధమైన ఆరోపణలు చేసినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలి" అని పోల్ సంస్థ వార్తా సంస్థ ANI చెప్పింది

2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానంలో లక్షకు పైగా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గురువారం ఆరోపించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ విధంగా స్పందించింది. పోలింగ్ అధికారులు "ఎన్నికల మోసం"లో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం బిజెపితో కుమ్మక్కైందని కూడా ఆయన ఆరోపించారు. కేంద్రంలో ప్రతిపక్షం తిరిగి అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని హెచ్చరించారు.

రాహుల్ గాంధీ ఓటు చోరీ విమర్శలు చేసిన తర్వాత కర్ణాటక ,మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు స్పందించారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్చారని చెప్పుకున్న ఓటర్ల పేర్లు అందించాలని కోరారు. వాటితోపాటు "అవసరమైన చర్యలు" తీసుకోవాలని చెప్పే 1960 ఓటర్ల నమోదు నియమాల నియమం 20 (3) (బి) కింద సంతకం చేసిన ప్రమాణ పత్రాన్ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అయితే, రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘం ప్రకటనపై సంతకం చేయడానికి బదులు తాను ఇప్పటికే పార్లమెంటులో రాజ్యాంగంపై ప్రమాణం చేశానని చెప్పారు.

"ఎన్నికల కమిషన్ నా నుంచి అఫిడవిట్ కోరుతోంది.నేను ప్రమాణం చేయాలని అందులో ఉంది. నేను ఇప్పటికే పార్లమెంటులో రాజ్యాంగంపై ప్రమాణం చేశాను" అని ఆయన బెంగళూరులో అన్నారు.

దీనిపై స్పందిస్తూ, ఎన్నికల కమిషన్ ఇలా చెప్పింది: "రోల్‌పై అభ్యంతరాలు తెలియజేయడానికి, అప్పీల్ చేయడానికి చట్టం ఒక నిర్దిష్ట విధానాన్ని అందిస్తుంది. చట్టపరమైన ప్రక్రియలను ఉపయోగించుకోవడానికి బదులు, మీడియాలో నిరాధారమైన ఆరోపణలు చేసి ఈ అంశాన్ని సంచలనంగా మార్చడానికి ప్రయత్నించారు."

'అరిగిపోయిన రికార్డు వేస్తున్నారు': రాహుల్ ఆరోపణలను ఈసీ విమర్శలు 

"అరిగిపోయిన రికార్డును మళ్లీ మళ్లీ వినిపిస్తున్నారని, పాత స్క్రిప్ట్‌ను పదే పదే చదువుతున్నారు" అని రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘం ఎదురుదాడి చేసింది, దీనిని గతంలో 2018లో అప్పటి MPCC అధ్యక్షుడు కమల్ నాథ్ చేశారని పేర్కొంది.

"2018లో, 36 మంది ఓటర్లు చాలా ప్రాంతాల్లో కనిపించారని ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని నిరూపించడానికి ఒక ప్రైవేట్ వెబ్‌సైట్ నుంచి డాక్యుమెంట్‌లను సమర్పించి సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు. వాస్తవానికి, లోపాలను దాదాపు 4 నెలల క్రితం సరిదిద్దారు. ఆ కాపీని అందించారు" అని ఎన్నికల సంఘం తెలిపింది.

"కోర్టులో నెగ్గుకు రాలేమని తెలిసి ఇప్పుడు వేర్వేరు ప్రదేశాల్లో ఒకే పేర్లతో ఓట్లు ఉన్నాయని ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు. వాస్తవానికి, మూడు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్లు ఆరోపించిన ఆదిత్య శ్రీవాస్తవ పేరును చాలా రోజుల క్రితమే సరిదిద్దారు" అని పేర్కొంది.