ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో మొదట భూమి కంపించింది.  దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి ఢిల్లీ, నోయిడాతో పాటు ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. అదే సమయంలో పాకిస్తాన్ లోనూ రిక్టర్ స్కేలుపై దాదాపు 7 తీవ్రతతో పలు చోట్ల భూమి కంపించింది. ఇస్లామాబాద్, రావల్ఫిండి, లాహోర్ లోనూ కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై తీవ్రత తెలియాల్సి ఉంది. ఈ ఏడాది పలుమార్లు ఢిల్లీలో, నార్త్ ఇండియాలో భూకంపాలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని ఫైజా బాద్ కు 77 కి.మీ దూరంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు. రాత్రి 10.17నిమిషాలకు ఈ భూప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.






భారత్ తో పాటు పలు ఆసియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. తుర్కిమెనిస్థాన్, కజకిస్థాన్, పాకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిస్థాన్ దేశాలలో కొంతసేపు భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 7.7గా ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.



రాత్రి 10 గంటల తరువాత ఉత్తరాది రాష్ట్రాలతో పలు ఆసియా దేశాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి కూర్చుని ఏం జరుగుతుందోనని, నిద్ర పోవాలో వద్దోనని వీధుల్లోనే ప్రజలు కనిపించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 






ఈ భారీ భూకంపంతో ఆయా దేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం ఏమన్నా సంభవించిందా అనే వివరాలు ఇంకా తెలియటం లేదు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఇతర భూకంప దేశాలలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏ క్షణాన రాత్రి మళ్లీ భూ ప్రకంపనలు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. భవనాల నుంచి బయటకు వచ్చి వీధులలో తిరుగుతున్నారు.