ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. అయితే అధికారంలో ఉన్న ఆప్​ లీడ్​లో వెనుకబడగా.. బీజేపీ దూసుకెళుతోంది. బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంతో మ్యాజిక్​ ఫిగర్​ను దాటింది. ధిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ నెల 5న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎలక్షన్​ కౌంటింగ్​ శనివారం 8 గంటల నుంచి ప్రారంభమైంది. కాగా కౌంటింగ్​లో బీజేపీ లీడింగ్​లో దూసుకెళుతోంది. 

26 స్థానాల్లోనే ఆమ్​ ఆద్మీఉదయం 10 గంటల సమయానికి బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు కావాల్సిన 36 మ్యాజిక్​ ఫిగర్​ను దాటేసింది. అధికారంలో ఉన్న ఆమ్​ ఆద్మీ పార్టీ కేవలం 26 స్థానాల్లో మాత్రమే లీడింగ్​లో ఉంది. కాంగ్రెస్​తోపాటు ఇతర పార్టీలు ఇంకా ఖాతా కూడా తెరవలేదు.

వెనుకబడ్డ కేజ్రీవాల్​, సీఎం ఆతిషీఆమ్​ ఆద్మీ పార్టీ ప్రముఖులు కూడా వెనుకంజలో ఉండడం గమనార్హం. ఆ పార్టీ చీఫ్​ అరవింద్ కేజ్రీవాల్​, ముఖ్యమంత్రి ఆతిషీతోపాటు మరికొందరు మంత్రులు కూడా కౌంటింగ్​లో వెనుకబడిపోయారు. ​న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్​వేశ్​ వర్మ.. అరవింద్​ కేజ్రీవాల్​పై స్వల్ప ఓట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక కాల్​కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిషీపై బీజేపీ అభ్యర్థి రమేశ్​ బిధూరి ముందంజలో ఉన్నారు.

బీజేపీకి 50 శాతానికి పైగా ఓట్లుకేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం, భారతీయ జనతా పార్టీకి ఇప్పటివరకు 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీకి 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ లీడ్​ ఇలాగే కొనసాగితే బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించినట్లే. 28 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

ఎగ్జిట్​ పోల్స్​ అంచనా ప్రకారమే..ఫిబ్రవరి 5న ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్​ పోల్స్​ అంచనా ప్రకారమే ఫలితాలు వస్తుండడం విశేషం. పీపుల్స్ ఇన్‌సైట్‌ సర్వే ప్రకారం మొత్తం 70 స్థానాలకుగాను బీజేపీ కూటమి 40 నుంచి 44 స్థానాల్లోనూ విజయం సాధిస్తుందని, ఆమ్‌ఆద్మీ 25 నుంచి 29 స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. 

బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్‌ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ సున్నా లేదా రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని టైమ్స్‌ నౌ అంచనా వేసింది. పీ-మార్క్‌ సర్వే ప్రకారం బీజేపీ కూటమి 39 నుంచి 49 స్థానాల్లోనూ, ఆమ్‌ఆద్మీ 21 నుంచి 31 సీట్లు, కాంగ్రెస్ సున్నా నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. పోల్‌ డైరీ సర్వే ప్రకారం బీజేపీ కూటమికి 42 నుంచి 50, ఆప్‌నకు 18 నుంచి 25, కాంగ్రెస్‌ సున్నా నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. చాణక్య స్ట్రాటర్జీస్‌ బీజేపీ కూటమి 39 నుంచి 44 స్థానాల్లోనూ, ఆప్‌ 25 నుంచి 28 స్థానాలు., కాంగ్రెస్ 2 నుంచి 3 చోట్ల విజయం స్థాదిస్తుందని పేర్కొంది.