Darjeeling Zoo: పశ్చిమబెంగాల్‌లోని జంతు సంరక్షణ కేంద్రాల్లో రెడ్‌ పాండా కూనలు, మంచు చిరుత పిల్లలు సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 15న డార్జిలింగ్‌లోని సింగలీలా నేషనల్‌ పార్కులో తీస్తా (Theesta), నీరా (Nira) అనే రెండు రెడ్‌ పాండాలు రెండు కూనలకు జన్మనిచ్చాయి.


అలాగే డార్జిలింగ్‌లోని పద్మజా నాయుడు హిమాలయన్‌ జూపార్కులో జీమా (Zima) అనే మంచు చిరుత ఈ ఏడాది జూలై 28న రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఇవి సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ చిరుత కూనల తల్లి జీమా వయస్సు ప్రస్తుతం 13 సంవత్సరాల 3 నెలలు. డార్జిలింగ్‌ జూలో ఇంత పెద్ద వయస్సులో పిల్లలు జన్మనిచ్చిన తొలి మంచు చిరుతగా జీమా గుర్తింపు పొందినదని జూ డైరెక్టర్‌ తెలిపారు. 


ప్రస్తుతం జంతు సంరక్షణ కేంద్రాల్లో రెడ్‌ పాండా కూనలు, మంచు చిరుత పిల్లలు    సందడి చేస్తూ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వాటికి ఎలాంటి హాని జరుగకుండా ఆరోగ్యపరంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. 


రెడ్ పాండాల గురించి తెలుసా?


ఎర్ర పాండాలు తూర్పు హిమాలయాల్లో నివసిస్తున్నాయి. మన ఇళ్లలో పెరిగే పిల్లి సైజులోనే పెరుగుతాయి. మంచు ప్రాంతంలో ఉండడం కారణంగా వీటికి బొచ్చు చాలా ఎక్కువగా పెరుగుతుంది. వెదురు చెట్ల ఆకులను ఇష్టంగా తింటాయి. ఇవి కనిపించడం చాలా అరుదు. ప్రస్తుతం వీటి సంఖ్య దాదాపు వీటి సంఖ్య 10 వేల వరకు ఉంటుందని అంచనా. 


ఇవి ఎక్కువ కాలం చెట్లపైనే జీవిస్తాయి. అక్కడే నిద్రపోతాయి. నేలపైకి వచ్చే సందర్భాలు తక్కువ.  సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆహారం కోసం తిరుగుతాయి.  అవి నడుస్తుంటూ చిన్న సైజు టెడ్డీ బేర్ కదులుతున్నట్లే ఉంటుంది. వాటి కలర్, బొచ్చు, తోక, ఆకారం అన్నీ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం  ఈ జాతి జంతువులు అంతరించిపోయే జంతువుల జాబితాలో చేరిపోయాయి.  


ఇవి తమ జీవితకాలంలో 55 రోజులే నిద్రపోతాయి. ఇవి ఒంటరిగానే తిరుగుతుంటాయి. కేవలం సంతానాన్ని ఉత్పత్తి చేసే రోజుల్లో మాత్రమే ఇవి ఇతర పాండాలను కలుస్తాయి. రెడ్ పాండాలు నిజానికి ఎలుగుబంట్ల జాతివి. వీటిని అల్యూరైడా జాతివిగా భావిస్తారు. ఎర్ర పాండాలకు మంచు అంటే చాలా ఇష్టం. వాటి ఎరుపు రంగు కారణంగా మంచులో అవి బాగా కనిపిస్తాయి. శీతాకాలంలో అవి ఎక్కువగా కనిపిస్తుంటాయి.


మంచు చిరుతలు


మంచు చిరుతలు చు పర్వతాలైన హిమాలయాల పర్వతాల్లో జీవిస్తాయి. మంచు ప్రదేశాల్లో ప్రమాదకరమైన జంతువుల్లో ఇవి కొన్ని. ఎంతో దట్టమైన లోయలలో, శిఖరాల మీద ఇవి నివసిస్తుంటాయి. ఈ చిరుతలు తమ శరీరం కంటే మూడు రెట్లు పెద్దగా ఉన్న జంతువులను సునాయాసంగా మట్టుబెట్టగలవు. వేటలో వీటికున్న నైపుణ్యంను బట్టి  పర్వతాల దెయ్యం పిలవడంలోనే ఇవి ఎంత ప్రమాదమైనవో అర్థం చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఎత్తైన పర్వత ప్రాంతాలలో నివసిస్తాయి. ఇవి ఒంటరిగా సంచరిస్తాయి.