DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డియర్‌నెస్ అలవెన్సును కేంద్రం పెంచింది. ఇప్పటి వరకు ఇచ్చే 53 శాతం డిఏను 55 శాతానికి తీసుకెళ్లింది.

DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రెండు శాతం డీఏ పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. డియర్‌నెస్ అలవెన్సు (DA) 2 శాతం మేర పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ(28 మార్చి, 2025,శుక్రవారం) నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ఇస్తున్న డీఏ 53 శాతం నుంచి 55 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి.
ఎంతమందిపై ప్రభావం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది వాటిలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఒకటి. ఇలా పెంచిన డీఏ 2025 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇది దాదాపు కోటి మందికిపైగా ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.
ఎప్పుడు రానుంది
ఇప్పుడు పెంచిన డీఏ జనవరి నుంచి అమలులోకి వచ్చినప్పటికీ ఏప్రిల్ శాలరీతో రానుంది. అంటే మే నెలలో ఉద్యోగుల చేతికి అందనుంది. అప్పుడు 3 నెలల ఎరియర్స్‌తో కలిపి ఉద్యోగుల, పింఛన్‌దారులకు ఇవ్వనున్నారు.
ఏడేళ్లలో అత్యల్పం
ప్రతి ఆరు నెలలకోసారి ప్రకటించే ఈ డీఏ ఈసారి మాత్రం ఆలస్యమైంది. జనవరి - జూన్ నెలలకు సంబంధించిన డీఏను ఏటా హోలీ టైంలో ప్రకించేవారు. ఈసారి మాత్రం ఆలస్యమైంది. ఆ పెంపు కూడా అనుకున్న స్థాయిలో లేదని ఉద్యోగులు అంటున్నారు. ఏడేళ్లలో ఇదే అత్యల్ప పెంపుగా చెబుతున్నారు. 2018 జులై నుంచి ప్రభుత్వం మూడు లేదా నాలుగు శాతం డీఏ పెంచుతూ వస్తోంది. ఈసారి మాత్రం రెండు శాతనికే పరిమితం చేయడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
8వ వేతన సంఘం ప్రకటించిన తర్వాత డీఏ పెంచడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జనవరి 16న 8వ వేతన సంఘం ఏర్పాటు విషయాన్ని వెల్లడించింది కేంద్రం. అయితే ఈ వేతన సంఘం సిఫార్సులు వచ్చే ఏడాది అమల్లోకి వస్తాయి. అందుకే దీపావళి టైంలో ప్రకటించే డీఏ కూడా ఏడో వేతన సంఘం కిందికే వస్తుంది. 8వ వేతన సంఘం సిఫార్స్‌లు అమలులోకి వచ్చిన తర్వాత డీఏను బేసిక్ శాలరీలో కలిపేస్తారు. అప్పటి నుంచి మళ్లీ డీఏ సున్నా నుంచి ప్రారంభమవుతుంది.