ఢిల్లీలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. వేదపండితుల మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా కార్యక్రమం జరుగుతోంది. దివ్య ముహూర్తం అనే నమ్మకంతో నేడు (డిసెంబరు 14) 12.37 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభించాలని ముందుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, సతీమణి శోభారాణితో కలిసి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ తో పాటు స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్, జేడీఎస్ అధినేత‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్‌ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకుల‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గుర్నాం సింగ్ సహా తదితర జాతీయ రైతు నంఘం నేతలు, మంత్రులు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


అనంత‌రం బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభించి, కేసీఆర్ ఆశీనుల‌య్యారు. తన ఛాంబర్‌లో కూర్చొన్నారు. శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరిగాయి. మొత్తంగా ఈ యాగాల్లో 12 మంది రుత్వికులు పాల్గొన్నారు.