అన్వేషించండి

CJI Surya Kant Remarks: "కొందరు యువకులు బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు" సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు 

CJI Surya Kant Remarks: నిరుద్యోగ యువతలో కొందరు బొద్దింకల్లా మారుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి కామెంట్ చేశారు. సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తల అవతారమెత్తి వ్యవస్థపై దాడి చేస్తున్నారన్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీనియర్ న్యాయవాది హోదా కోసం పిటిషన్, ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
  • వ్యవస్థపై దాడి చేసే బొద్దింకల్లా కొందరు యువకులు మారుతున్నారని సీజేఐ ఆవేదన.
  • డిగ్రీల వాస్తవికతపై అనుమానాలు, సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించే ఆలోచన.
  • న్యాయవాది తప్పును అంగీకరించి, క్షమాపణ చెప్పి పిటిషన్ ఉపసంహరించుకున్నారు.

CJI Surya Kant Remarks: సమాజంలోని కొన్ని ధోరణులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(CJI Surya Kant ) చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు యువకులు బొదింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చీ(Justice Joymalya Bagchi)లతో కూడిన ధర్మాసనం ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ విచారించింది. సదరు న్యాయవాది తనకు సీనియర్ అడ్వకేట్ హోదా(Senior Advocate designation rules) కల్పించాలని కోరుతూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. సీనియర్‌ హోదా అనేది కోరుకుంటే వచ్చేది కాదని, అది వ్యక్తి ప్రవర్తన, అర్హతను బట్టి లభించే గౌరవమని స్పష్టం చేసింది. 

సదరు పిటిషనర్‌ గతంలో సోషల్ మీడియా వేదికగా ఉపయోగించిన భాషను ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు. వృత్తిపరమైన క్రమశిక్షణ లేని వ్యక్తులు ఇటువంటి హోదాలకు అర్హులు కారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే నిరుద్యోగ యువత దారి తప్పడంపై సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. 

సమాజంలో ఇప్పటికే కొన్ని పారాసైట్స్‌ ఉన్నాయి. వారు వ్యవస్థపై దాడులు చేస్తున్నారు. మీరు కూడా వారితో చేతులు కలపాలని అనుకుంటున్నారా అని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఉపాధి లేని కొందరు యువకులు బొద్దింకల్లా (Cockroaches)తయారవుతున్నారని వారు మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలు(RTI Activists )గా మారి ప్రతి ఒక్కరిపై దాడులు చేయడం ప్రారంభిస్తున్నారని సీజేఐ వ్యాఖ్యానించారు. 

ఈ విచారణ సందర్భంగా న్యాయవాద వృత్తిలోని లోపాలను కూడా ధర్మాసనం ఎత్తి చూపింది. ఢిల్లీ హైకోర్టు ఒకవేళ  పిటిషనర్‌కు సీనియర్ హోదా ఇచ్చినా ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టి సుప్రీం కోర్టు దానిని రద్దు చేస్తుందని సిజేఐ హెచ్చరించింది. నల్లకోట్లు ధరించి అనేక మంది వ్యక్తుల డిగ్రీల వాస్తవికతపై తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అనుకుంటున్నట్టు ధర్మాసనం పేర్కొంది.    ఓట్ల రాజకీయ కారణంగా బార్ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా ఆ అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధర్మాసనం విమర్శించింది. 

సుప్రీంకోర్టు(Supreme Court of India) వ్యాఖ్యలతో ఏకీభవించిన పిటిషనర్‌ న్యాయవాది, తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పారు. అనంతరం తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా ధర్మాసనం అందుకు అంగీకరించింది. 

Frequently Asked Questions

సీనియర్ అడ్వకేట్ హోదా కోసం దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ప్రధాన న్యాయమూర్తి ఏ వ్యాఖ్యలు చేశారు?

సీనియర్ హోదా అనేది కోరుకుంటే వచ్చేది కాదని, అది వ్యక్తి ప్రవర్తన, అర్హతను బట్టి లభించే గౌరవమని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. వృత్తిపరమైన క్రమశిక్షణ లేని వ్యక్తులు దీనికి అర్హులు కారని స్పష్టం చేశారు.

నిరుద్యోగ యువత గురించి ప్రధాన న్యాయమూర్తి ఏమన్నారు?

ఉపాధి లేని కొందరు యువకులు బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడులు చేస్తున్నారని, వారు మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి ప్రతి ఒక్కరిపై దాడి చేస్తున్నారని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయవాద వృత్తిలోని లోపాలపై ధర్మాసనం ఏమన్నది?

నల్లకోట్లు ధరించిన అనేక మంది డిగ్రీల వాస్తవికతపై తమకు అనుమానాలున్నాయని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అనుకుంటున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

పిటిషనర్ న్యాయవాది చివరికి ఏమి చేశారు?

సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవించిన పిటిషనర్, తన తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పారు. అనంతరం తన పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా ధర్మాసనం అంగీకరించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narendra Modi Donald Trump Meeting: మోదీ-ట్రంప్ బంధం బీటలు వారిందా..? ఆ ఆప్యాయత.. ఏమైందో...ఆ ఆలింగనాలు ఏక్కడికి పోయాయో...?
ఆ ఆప్యాయత.. ఏమైందో...  ఆ ఆలింగనాలు ఏక్కడికి పోయాయో.. మోదీ-ట్రంప్ బంధం బీటలు వారిందా..?
Breaking News: హనుమకొండకు రానున్న పవన్ కళ్యాణ్.. అభిమానికి జనసేనాని పరామర్శ
హనుమకొండకు రానున్న పవన్ కళ్యాణ్.. అభిమానికి జనసేనాని పరామర్శ
Pranit More: 370 బిర్యానీ ఎపిసోడ్‌లో ప్రణీత్, హిమాన్షుపై మరో కేసు... చట్టపరమైన చిక్కుల్లో కామెడీ కాంట్రవర్సీ
370 బిర్యానీ ఎపిసోడ్‌లో ప్రణీత్, హిమాన్షుపై మరో కేసు... చట్టపరమైన చిక్కుల్లో కామెడీ కాంట్రవర్సీ
Special Parliament Session 2026: 850 లోక్‌సభ సీట్లు.. మహిళా కోటా బిల్లు కోసం కేంద్రం తెరవెనుక స్కెచ్! పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎప్పుడంటే?
850 లోక్‌సభ సీట్లు.. మహిళా కోటా బిల్లు కోసం కేంద్రం తెరవెనుక స్కెచ్! పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Letter to Kishan Reddy: ఎవరినీ దానం అడగటం లేదు, రావాల్సిన లోన్ నిధులు ఇప్పించండి: మెట్రో ఫేజ్2పై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ
ఎవరినీ దానం అడగటం లేదు, రావాల్సిన లోన్ నిధులు ఇప్పించండి: మెట్రో ఫేజ్2పై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ
AP Delimitation 2026: ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
ఏపీలో కూటమి చేరికల పర్వం - పవన్ కల్యాణ్ స్పెషల్ కమిటీ.. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమేనా?
Kishan Reddy: మెట్రో లోన్ ఆగిన విషయమే తెలియదు - రేవంత్ ఆరోపణలపై కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్
మెట్రో లోన్ ఆగిన విషయమే తెలియదు - రేవంత్ ఆరోపణలపై కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్
Strait of Hormuz: హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
IPL Business Update: ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
PM Modi Investment Scheme Fact Check: ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
Embed widget