PM Modi And AP Deputy CM Pawan Kalyan On Vikram 1 Rocket Launch: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ఇవాళ (జూలై 18, శనివారం) సరికొత్త అధ్యాయం మొదలైంది. చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. స్వదేశీ పరిజ్ఞానం ద్వారా స్పేస్‌టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1' విజయవంతంగా నింగిలోకి దూసుకు వెళ్ళింది. శ్రీహరికోటలో చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఈ విజయంపై చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇదొక చారిత్రాత్మక మైలురాయిChiranjeevi Tweet On Vikram 1 Rocket Launch: భారతదేశ అంతరిక్ష ప్రస్థానంలో 'విక్రమ్ 1' రాకెట్ లాంచ్ విజయవంతం కావడం చారిత్రాత్మక మైలురాయిగా మెగాస్టార్ చిరంజీవి అభివర్ణించారు.
విక్రమ్ 1 గురించి చేసిన ట్వీట్‌లో చిరంజీవి ''మన దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్ 1'ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్ స్పేస్‌లకు హృదయపూర్వక అభినందనలు. ఈ అద్భుతమైన విజయాన్ని హైదరాబాద్‌లోని స్కైరూట్‌లోని యువత ఆధ్వర్యంలో రూపొందించారని, అభివృద్ధి చేశారనే విషయం నాకు ఎంతో గర్వాన్ని కలిగిస్తోంది. ఈ చారిత్రాత్మక విజయం ఎంతో మంది యువతకు స్ఫూర్తిని ఇవ్వాలని, మన దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆకాంక్షిస్తున్నాను'' అని తెలిపారు.
ఫోనులో అభినందించిన ప్రధాని మోడీ'విక్రమ్ 1' విజయం తర్వాత స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్‌లతోప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోనులో మాట్లాడారు. వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. "విక్రమ్ 1' విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ స్వావలంబన సాధించగలదని ప్రపంచానికి చూపించారు. యువత కలలకు మీరు కొత్త ఆశలు తొడిగారు" అని అభినందించడంతో పాటు తాను స్వయంగా ఆ ప్రయోగాన్ని వీక్షించానని తెలిపారు. స్కైరూట్ బృందంలో ఎక్కువ మంది యువత ఉండటం, వాళ్ళ సగటు వయసు 28 ఏళ్ళు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆ యువ బృందాన్ని కలిసేందుకు ఆహ్వానించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'విక్రమ్ 1' విజయంపై స్పందిస్తూ... ''మన దేశానికి ఎంతో గర్వకారణమైన ప్రయోగమిది. సాంకేతికతకు, సృజనాత్మకతకు ప్రధాని మోడీ ఇచ్చే ప్రాధాన్యత మరోసారి రుజువైంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే శక్తిమంతమైన సందేశాన్ని ఈ విజయం దేశ ప్రజలకు అందించింది. భావి తరాలకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుందీ ప్రయోగం'' అని పేర్కొన్నారు.
