Maoists Money Seized | పట్టు పట్టరాదు.. పట్టి విడుదరాాదు.. పట్టి విడువటకన్నా.. పడి చచ్చుటమేలయా.. అన్న సామెతను కార్యరూపంలో పెట్టి చేసి మరీ చూపిస్తోంది కేంద్ర హోశాఖ. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల అంతమే లక్ష్యంగా పెట్టుకుని, అదే పట్టుతో ముందు సాగుతూ ,దాదాపు లక్ష్యానికి చేరువలోకి వచ్చేసింది. మావోస్టుల విషయంలో కేంద్రం తీరుపై ప్రజాసంఘాలు మండిపడుతున్నా, మానవ హక్కుల ఉల్లంఘన అంటూ ఉద్యమనేతలు గోలపెడుతున్నా డోంట్ కేర్ అంటూ ముందుకు దూసుకుపోతోంది.

Continues below advertisement

కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమం

ఏ ఉద్యమైనా ఆర్దిక మూాలాలను దెబ్బకొడితే, ఆ ప్రభావం , ఆయా ఉద్యమాాలపై తీవ్రంగా ఉంటుంది. అందులోనూ జనజీవన స్రవంతికి దూరంగా అడవుల్లో తిరుగుతున్న అన్నలపై ఇంకాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. తాజాగా మావోయిస్టుల ఆస్తులను సీజ్ చేసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా ఏకంగా 92కోట్ల రూపాయల అన్నల ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో , ఇప్పటికే కొనఊపిరితో ఉన్న మావోయిస్టు ఉద్యమం, ఇక దాదాపు కనుమరుగైయ్యే పరిస్దితులు ఏర్పాడ్డాయి. 

Continues below advertisement

ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోన్న కేంద్రం

దేశంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర హోంశాఖ, పలు దర్యాప్తు సంస్దలు మొదటి నుండి వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి. ఓవైపు ఆపరేషన్ కగార్ పేరుతో భారీగా భద్రతా బలగాల కూంబీంగ్,  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఝానంతో  మావోల గుర్తింపు, ఎన్ కౌంటర్ ఇలా దండకారణ్యంలో అన్నల ఏరివేత ప్రక్రియ కొనసాగిస్తూనే , మరోవైపు అంతే స్దాయిలో మావోయిస్టుల ఆస్తులపై, ఆర్దిక మూలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ జాతీయ దర్యాప్తు సంస్ద ఎన్ ఐఏ  40కోట్ల రూపాయల మావోయిస్టు ఆస్దులను సీజ్ చేసింది. ఢిల్లీ పోలీసులు మరో 40కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేశారు. వీరితో పాటు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరో 12 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా మొత్తంగా ఇప్పటి వరకూ 92 కోట్ల రూపాయలు మావోయిస్టు ఆస్తులను, వారి మనుగడకు కీలకంగా మారిన ఆర్దిక మూలాలను కట్టడి చేస్తోంది కేంద్రం ప్రభుత్వం.

2014లో 126.. 2025లో 11కి తగ్గిన ప్రభావం

ఇదిలా ఉంటే ఆపరేషన్ కగార్ కు  ముందు ,  తరువాత మావోయిస్టుల ప్రాబల్యంపై కూడా కేంద్రం కోలుకోలేని దెబ్బకొట్టింది. 2014లో దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు 126 జిల్లాలు  ఉండగా, 2025 నాటి ఆ సంఖ్య 11 జిల్లాలకు మాత్రమే పరిమితమైయ్యింది. 2014లో మావోయిస్టు అత్యంత ప్రభావిత జిల్లాలు 36 ఉండేవి, అవి కాస్తా 2025 నాటి కేవలం 3 జిల్లాలకు చేరుకున్నాయి. ఇంతలా మావోల ప్రభావంపై కోలుకోలేని  దెబ్బకొట్టింది హోంశాఖ.ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 317 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ 862 మంది మావోస్టులు అరెస్ట్ అయ్యారు.

1973 మంది మావోయిస్టులు లొంగిపోయాారు. ఒక్క అక్టోబర్ నెలలోనే చత్తీస్ ఘడ్, మహారాష్ట్రలలో 258 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇంతా మావోయిస్టు ఉద్యమం కుదేలవడానికి ప్రధాన కారణం , మావోయిస్టుల కీలక నేతలను కేంద్రం టార్గెట్ చేయడం. 2024 నుండి ఇప్పటి వరకూ 28 మంది హిడ్మా వంటి మావొోయిస్టు అగ్రనేతలు వివిధ ఎన్ కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఇలా దెబ్బమీద దెబ్బ అన్నట్లు ఏకంగా 60 ఏళ్ల నాటి సాయుధపోరాటం, మావోయిస్టుల ఉద్యమం అంతిమ దశకు చేరుకుంది. అనుకున్న లక్ష్యాన్ని పెట్టుకున్న గడువులోపే పూర్తి చేస్తామనే ధీమాతో కేంద్రం దూసుకుపోతోంది.