2027 Census India | భారతదేశం 2027లో మొదటిసారిగా డిజిటల్ జనాభా లెక్కల సేకరణకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం పౌరులకు డేటా భద్రత, ప్రైవసీకి హామీ ఇచ్చింది. అయితే చట్టం కూడా వాస్తవాల గురించి అంతే కఠినంగా వ్యవహరించనుంది. జనాభా లెక్కల సమయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం శిక్షార్హమైన నేరం. నియమాలు ఏమిటో చూద్దాం.

Continues below advertisement

జనాభా లెక్కల సేకరణలో ఖచ్చితత్వం చట్టబద్ధంగా ఎందుకు అవసరం?

జనాభా లెక్కల సేకరణ అనేది కేవలం ఒక గణాంక సర్వే మాత్రమే కాదు. ఒక రాజ్యాంగ, పరిపాలనా ఆధారంగా ఈ లెక్కల్ని పరిగణిస్తారు. జనాభా లెక్కల డేటా పార్లమెంటరీ నియోజకవర్గాలు, సంక్షేమ కేటాయింపులు, రిజర్వేషన్ విధానం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రాష్ట్రాలకు నిధులు వంటివి నిర్ణయిస్తుంది. అందుకే తప్పుడు సమాచారాన్ని జాతీయ ప్రణాళికకు హాని కలిగించే చర్యగా చట్టం పరిగణిస్తుంది. జనాభా లెక్కల చట్టం 1948 ప్రకారం, ప్రతి వ్యక్తి జనాభా లెక్కల అధికారులకు ఖచ్చితమైన సమాచారం అందించడానికి చట్టానికి కట్టుబడి ఉంటారు.

Continues below advertisement

జనాభా లెక్కల సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే శిక్ష

జనాభా లెక్కల సమయంలో ఎవరైనా కావాలని తప్పుడు సమాధానాలు ఇస్తే, చట్టం ₹1000 వరకు జరిమానా విధించడానికి అనుమతిస్తుంది. జనాభా లెక్కల సేకరణను శారీరకంగా లేదా డిజిటల్ పరికరాల ద్వారా నిర్వహించినా ఇది వర్తిస్తుంది. ఇందులో ఇంటి సభ్యులను దాచడం, వయస్సు, ఆదాయ వర్గం లేదా వృత్తి గురించి తప్పుగా చెప్పడం లాంటి విషయాలు ఉన్నాయి.

 జైలు శిక్ష విధించవచ్చు

జైలు శిక్ష సాధారణంగా విధించే శిక్ష కాదు. కానీ ఇది తీవ్రమైన లేదా పెద్ద కేసులలో ఇలాంటి శిక్ష వర్తిస్తుంది. తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు, జనాభా లెక్కల పనికి ఆటంకం కలిగించడం, జనాభా లెక్కల రికార్డులను మార్చడం లేదా పదేపదే సహకరించకపోవడం లాంటి నేరానికి పాల్పడితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

జనాభా లెక్కల చట్టం 1948 సంబంధిత సెక్షన్లు

సెక్షన్ ఎనిమిది ప్రకారం, ప్రతి వ్యక్తి జనాభా లెక్కల ప్రశ్నలకు నిజాయితీగా తమ సమాధానం చెప్పాలి. అదేవిధంగా, శిక్షకు సంబంధించిన సెక్షన్ 11 ప్రకారం, సమాధానం చెప్పడానికి నిరాకరించడం, తప్పుడు సమాధానాలు ఇవ్వడం, వాస్తవాలను దాచిపెట్టడం లేదా జనాభా లెక్కల పత్రాలు, ఇంటి నంబర్ గుర్తులను మార్చడం నేరం కింద పరిగణిస్తారు.

దుర్వినియోగం గురించి భయం నిరాధారమైనది

నిజాయితీని ప్రోత్సహించడానికి, జనాభా లెక్కల చట్టం మీ డేటాపై గోప్యతను అందిస్తుంది. సెక్షన్ 15 ప్రకారం, జనాభా లెక్కల డేటాను కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించకూడదు. ఇది పోలీసు, పన్ను అధికారులు లేదా ఇతర విభాగాలతో పంచుకోరాదని, చట్టపరమైన చర్యలలో వ్యక్తికి వ్యతిరేకంగా ఉపయోగించకూడదని చట్టం చెబుతోంది.