18th BRICS Summit: దిల్లీలోని భారత్ మండపంలో రెండ్రోజుల పాటు జరిగిన బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు (BRICS 2026) ముగిసింది. సదస్సు చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ సభ్య దేశాలు మరింత సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Continues below advertisement

ప్రధాని మోదీ ప్రసంగం  

సాంకేతిక పరిజ్ఞానాన్ని, కీలకమైన ఖనిజాలను ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయుధాలుగా ఉపయోగిస్తే అది ఉమ్మడి అభివృద్ధికి ఆటంకం అవుతుందని  ప్రధాని మోదీ అన్నారు. అందరినీ కలుపుకొని పోయే సాంకేతికతే బ్రిక్స్ లక్ష్యమని తెలిపారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ప్రపంచ సంక్షోభాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో వెనుకబడిపోతున్నాయని అన్నారు. ఇకపై గ్లోబల్ సౌత్ రూల్స్ పాటించేదిగా మాత్రమే కాకుండా, రూల్స్ సెట్ చేసే శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. Also Read: సీఐఏ సంచలన రిపోర్ట్.. ఒసామా బిన్ లాడెన్ హిట్ లిస్ట్‌లో భారత్!

బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్

మానవ అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య బ్యాలెన్స్ పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రకృతిని తల్లిగా భావించే భారతీయ నాగరికత మూలాలను గుర్తుచేశారు. బ్రిక్స్ దేశాలలోని పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారుల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి "బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్" ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు. బ్రిక్స్ సహకారం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాకుండా రైతులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, యువతతో కూడిన ప్రజా ఉద్యమంగా మారాలని ఆకాక్షించారు. Also Read: పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ బ్రిక్స్ ప్రకటన.. ఏకపక్ష సుంకాలపై ఆందోళన- భారత్ దౌత్య విజయం

Continues below advertisement

చైనా-భారత్ సంబంధాలపై 

మరోవైపు, భారత్, చైనాలు భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కాదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల అభివృద్ధి ఒకదానికొకటి అవకాశాలను పెంచుతుందే తప్ప ముప్పు కాదని ఆయన పేర్కొన్నారు. మొత్తం 21 మంది దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో దేశాల మధ్య సహకారం, ఆవిష్కరణ, సుస్థిర అభివృద్ధి అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు.   Also Read: బ్రిక్స్ వేదికగా భారత్ గ్లోబల్ సౌత్ గొంతుకగా, లీడర్‌గా ఎలా మారుతోంది ?