Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే 13 ఏళ్ల కిందట ఇదే నెహ్రూ స్టేడియంలో ఆయనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.

చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పూర్తి చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించిన ఆ పార్టీకి.. భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI), కాంగ్రెస్, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ (CPM), విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు తెలపడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ టీవీకే అధినేత విజయ్‌తో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయించనున్నారు. టీవీకే కార్యకర్తలు, విజయ్ ఫ్యాన్స్, మద్దతుదారులు ఈ సందర్భాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. అయితే, నేడు సీఎంగా ప్రమాణం చేస్తున్న నెహ్రూ ఇండోర్ స్టేడియంలో 2013లో విజయ్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది.
చివరి వరుసలో విజయ్‌కి సీటు
2013వ సంవత్సరంలో భారత సినిమా శతాబ్ది ఉత్సవాలు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అధ్యక్షత వహించారు. ఆ కార్యక్రమంలో స్టార్ హీరో విజయ్‌ని చివరి వరుసలో కూర్చోబెట్టారు. విజయ్‌కి చివరి లైన్లో సీటు ఇవ్వడం చూసి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారు. అప్పటికే విజయ్ కోలీవుడ్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నాడు. స్టార్ హీరోలలో ఒకరు అయినప్పటికీ.. అలాంటివి పట్టించుకోకుండా విజయ్ తనకు కేటాయించిన చోటే చివర్లో కూర్చున్నారు. ఆ స్థితిలో నటుడు విక్రమ్, విజయ్ పక్కన కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించడాన్ని దళపతి ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోరు. ఈ సంఘటన ఇప్పటికీ విజయ్ అభిమానులకు చేదు జ్ఞాపకంగా ఉంది. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ సినిమా ఫంక్షన్స్ ఎన్నో జరిగినప్పటికీ, 2013లో జరిగిన ఈ సంఘటన ఒక మాయని గాయంగా మిగిలిపోయింది.
జయలలిత ఎందుకలా చేశారు..
సినీ వేడుకల్లో విజయ్‌కి ఉద్దేశపూర్వకంగా చివరి లైన్లో సీటు కేటాయించడానికి కారణం ఆ సమయంలో ఆయన నటించిన 'తలైవా' సినిమా విడుదలైంది. అందులో టైటిల్ కింద “Time To Lead” అనే ట్యాగ్ లైన్ ఉంది. ఇది అప్పటి సీఎం జయలలితకు తీవ్ర ఆగ్రహం కలిగించినట్లు ప్రచారం జరిగింది. ఆ ట్యాగ్‌లైన్ వతొలగించకపోతే సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం నుంచి పరోక్షంగా హెచ్చరికలు వచ్చాయి. దీంతో 'తలైవా' సినిమా రిలీజ్ చిక్కుల్లో పడింది.

తమిళనాడులో 10 రోజులు ఆలస్యం..
ఇతర రాష్ట్రాల్లో చెప్పిన తేదీకే తలైవా సినిమా విడుదలవ్వగా, అప్పటి తమిళనాడు ప్రభుత్వం అడ్డుకోవడంతో రాష్ట్రంలో సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు 10 రోజుల తర్వాత తమిళనాడులో తలైవా మూవీ విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ కోసం కోడనాడులో ఉన్న జయలలితను కలవడానికి విజయ్ స్వయంగా వెళ్లారు. తరువాత విజయ్ ఒక వీడియో ద్వారా అప్పటి సీఎం జయలలిత సహాయాన్ని కోరారు. ఆ తర్వాత టైమ్ టు లీడ్ అనే ట్యాగ్ లైన్ తొలగించడంతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. కొన్ని ఇతర పార్టీల మద్దతుతో నేడు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
అప్పటి నుండి విజయ్ ప్రతి సినిమా విడుదల సమయంలోనూ ఏదో విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. సమాజంలోని సమస్యలు లేవనెత్తడం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, అవినీతిని ప్రశ్నించడం.. మార్పు కోసం అంటూ సమాజానికి సంబంధించిన అంశాలపై సినిమాలు చేయడమే అందుకు కారణమని విజయ్ ఫ్యాన్స్ చెబుతారు.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు























