Bihar Bridge Collapse: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఓ ఐఏఎస్ షాకిచ్చారు. బిహార్‌లోని ఓ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై వివరణ కోరిన గడ్కరీ.. సదరు ఐఏఎస్ చెప్పిన సమాధానం విని అవాక్కయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా గడ్కరీనే సోమవారం వెల్లడించారు.
ఏమైందంటే?
బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో గంగా నదిపై కడుతున్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఏప్రిల్ 29న కూలిపోయింది. దీనిపై సంబంధిత ఐఏఎస్ అధికారిని నితిన్ గడ్కరీ వివరణ కోరగా పెనుగాలే కారణమని తేలిగ్గా చెప్పేశారట.
"గాలి మరీ గట్టిగా వచ్చింది. అందుకే బ్రిడ్జి కడుతుండగానే కూలిపోయింది" అని ఆ ఐఏఎస్ చెప్పారని గడ్కరీ అన్నారు. ఈ మాటలు విని తాను షాకైనట్లు గడ్కరీ చెప్పారు.
నితిన్ గడ్కరీ చెప్పిన ఈ మాటలు విని ఆ సమావేశంలో ఉన్నవారంతా గట్టిగా నవ్వారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా గడ్కరీకి మద్దతుగా 'గాలికి బ్రిడ్జి ఎలా కూలుతుంది ఐఏఎస్ గారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Coronavirus Cases India: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు- 10 మంది మృతి
Also Read: South Korea's New President: దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్- కిమ్‌తో చర్చకు రెడీ