G20 Summit 2023 in Delhi: సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ 20 సదస్సు జరుగునుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సదస్సులో పాల్గొనేందుకు గురువారం భారత్ రానున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా, ఆష్ట్రేలియా, జపాన్ దేశాల అధినేతలను ఆహ్వానించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా షెడ్యూల్ ఆధారంగా తుది ప్రకటన ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 


ఏటా గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి ఏదో ఒక దేశాధినేతను అతిథిగా భార్ ఆహ్వానిస్తోంది. అయితే ఈ సారి వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిని నిర్ణయించేందుకు న్యూఢిల్లీలో జరిగే జీ 20 సదస్సు వేదికగా వ్యూహం రచించింది. మామూలుగా నాయకుల అందుబాటులో ఉంటారో లేదో అనధికారికంగా తెలిసిన తరువాతే అధికారిక ఆహ్వానం పంపబడుతుంది. అయితే ఈ సారి మూడు దేశాల నేతలు G20 సమ్మిట్‌కు ఇక్కడకు రానున్న నేపథ్యంలో వారిని రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌ను నిర్వహించడం భారత్ వంతు.


ప్రస్తుతం ముగ్గురు నేతలు బిజీ షెడ్యూల్స్‌లో ఉన్నారు. బైడెన్ 2024 చివరి నాటికి ఎన్నికల సంవత్సరం వైపు వెళతారు. దేశం ఎన్నికలకు వెళ్లే ముందు జనవరి బైడెన్‌కు చివరి స్టేట్ ఆఫ్ ది యూనియన్ అవునుంది. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం జనవరి 26న తన జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది ద్వీప ఖండంలో మొట్టమొదటి శాశ్వత యూరోపియన్ స్థాపనను ఏర్పాటు చేసింది. గణతంత్ర దినోత్సవం మాదిరిగానే అల్బనీస్ పబ్లిక్ వేడుకలతో బిజీగా ఉంటారు. జపాన్ పార్లమెంట్ సెషన్‌ను జనవరి చివరి వారంలో జరగనుంది. బడ్జెట్ సెషన్‌లో ప్రధాన మంత్రి కిషిడా అక్కడ హాజరయ్యే అవకాశం ఉంది. క్వాడ్ లీడర్లందరినీ ఏకతాటిపైకి తెచ్చే ఈ ప్లాన్ వర్కవుట్ అయితే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దూకుడుగా వ్యవహరించే చైనాకు బలమైన సంకేతం పంపినట్లు అవుతుందని భారత్ భావిస్తోంది.


జీ20 సదస్సులో పాల్గొనేందుకు బైడెన్ గురువారం న్యూఢిల్లీ రానున్నారు. శుక్రవారం మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొని శని, ఆదివారాల్లో జరిగే శిఖరాగ్ర సమావేశాల్లో బైడెన్ పాల్గొంటారు. దీనిపై US జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ భాగస్వాములతో కలిసి పని చేయడానికి బైడెన్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ వారాంతంలో న్యూ ఢిల్లీలో జరిగేదానిని ప్రపంచం చూస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. G20 అమెరికా నిబద్ధత ఏ మాత్రం తక్కువ కాదని, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కఠిన సమయాల్లో కూడా కలిసి పనిచేయగలవని న్యూఢిల్లీలో జరిగే సమ్మిట్ చూపుతుందని అన్నారు. జీ20 సదస్సులో అమెరికా పలు అంశాలు ప్రస్తావిస్తుందని, బహుళపక్ష బ్యాంకుల అభివృద్ధి, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లను ప్రాథమికంగా పునర్నిర్మించడం ప్రధాన ఎజెండా అని NSA తెలిపింది.


జీ 20 శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ రాకపోవడంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. జిన్‌పింగ్ గైర్హాజరు సదస్సు ఏకాభిప్రాయ ప్రకటన, చర్చలను ప్రభావితం చేయదన్నారు. చాలా అల్లకల్లోలమైన పరిస్థితుల నేపథ్యంలో ఈ సమ్మిట్ నిర్వహించబడుతోందని, ప్రపంచంలోని కొన్ని ముఖ్యమైన సమస్యలకు G20 పరిష్కారాలను కనుగొనే అవకాశాలు చాలా ఎక్కువ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతి హాజరు కాకపోవడం సమ్మిట్‌పై ప్రభావం చూపుతుందా అని అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇస్తూ.. గౌర్హాజరుతో రష్యాకు భారతదేశంతో సంబంధం లేదని తాను అనుకోనని అన్నారు.