Breaking News: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితుల్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్
Top Stories Today | జూన్ 10న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, సినీ, క్రీడా ఇతర రంగాల అప్‌డేట్స్ కోసం పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Top Stories | నేటి వార్తల అప్‌డేట్స్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితుల్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలతో మాట్లాడిన తరువాత, సెవెన్ హిల్స్ హాస్పిటల్ డాక్టర్లను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. బాధితులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
భారతీరాజాకు నివాళులర్పించిన తమిళనాడు సీఎం విజయ్
ప్రముఖ దర్శకుడు, నిర్మాత భారతీరాజా (84) చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. భారతీరాజా మరణంపై తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అన్నారు. భారతీరాజా నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి నివాళులర్పించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకున్నారు.
Exclusive:- CM Vijay Paid Last Respect For Legendary Director Bharathiraja sir 💔 🙏🏻
— TD....❥ (@MiniiGirl__) June 10, 2026
pic.twitter.com/ztedZn923G
నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు ఏపీ సీఎం చంద్రబాబు విషెస్
తన వియ్యంకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు విషెస్ తెలిపారు. 5 దశాబ్దాలుగా సినిమాల్లో ధ్రువతారగా వెలుగొందుతూ కోట్ల మందిని అలరిస్తున్న బాలకృష్ణ.. ఇటు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేశారని కొనియాడారు. దివంగత ఎన్టీఆర్ గారి ఆశీస్సులు బాలకృష్ణపై కలకలం ఉండాలని కోరుకున్నారు.
#HappyBirthdayNBK
— N Chandrababu Naidu (@ncbn) June 10, 2026
సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో… pic.twitter.com/JZV5Fj4iv8
చెన్నై: భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమిళనాట దర్శక శిఖరంగా, సంచలనాల దర్శకుడిగా పేరు పొందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు భారతీరాజా (84) ఇకలేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన స్వగృహంలో బుధవారం (జూన్ 10, 2026) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
భారతీరాజా వ్యక్తిగత జీవితంలో గత ఏడాది ఎదురైన ఒక పెను విషాదం ఆయనను మానసికంగా దెబ్బతీసింది. ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజా గత ఏడాది మార్చిలో అకాల మరణం చెందారు. కుమారుడి మృతితో భారతీరాజా తీవ్రమైన మనోవేదనకు గురయ్యారని, ఆ బాధ నుంచి ఆయన కోలుకోలేకపోయారని సమాచారం. పుత్రశోకం కారణంగానే గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని భారతీరాజా సోదరుడు జయరాజ్ గతంలో ఒక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు.
తమిళ సినిమాను స్టూడియోల నాలుగుడెవల మధ్య నుంచి పల్లెటూరి పచ్చదనం వైపు, సహజత్వానికి దగ్గరగా నడిపించిన ఘనత భారతీరాజాకే దక్కుతుంది. ఆయన మరణం దక్షిణాది చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా తమిళ సినిమా రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
భారతీరాజా మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు: వైయస్ జగన్
ప్రముఖ దర్శకుడు, నటుడు, తమిళ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ సినీ వ్యక్తిత్వం భారతీరాజా మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పేర్కొన్నారు. భారత సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీరాజా గారు దర్శకుడిగా, నటుడిగా అనేక తరాల సినీ అభిమానులను ప్రభావితం చేశారని వైయస్ జగన్ అన్నారు.
దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేసిన భారతీరాజా ఇటీవల కాలంలో పలు చిత్రాల్లో విశిష్ట పాత్రలు పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందారని అన్నారు. భారతీరాజా మరణం దక్షిణ భారత సినీ పరిశ్రమకు, కళారంగానికి తీరని లోటని పేర్కొన్న వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరమపదించిన భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ప్రార్థించారు.
నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెస్..
ప్రముఖ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. బాలకృష్ణకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
ప్రముఖ కథానాయకుడు, హిందూపురం శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ బాలకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) June 10, 2026
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు: ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులు
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో యుద్ధ జ్వాలలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సాగుతున్న దాడులు, ప్రతీకార దాడులతో అట్టుడుకుతున్న ఈ ప్రాంతంలో, తాజాగా అమెరికా నేరుగా రంగంలోకి దిగడంతో పరిణామాలు మరింత ఆందోళనకరంగా మారాయి. మంగళవారం ఒమన్ తీరం, హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అధునాతన అపాచీ హెలికాప్టర్ (AH-64)ను ఇరాన్ దళాలు కూల్చివేయడమే మరోసారి ఉద్రికత్తలకు దారితీసింది.
అగ్రరాజ్యానికి చెందిన ప్రతిష్టాత్మక హెలికాప్టర్‌ను కూల్చివేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రంగా పరిగణించారు. ఈ ఉద్దేశపూర్వక దాడికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, అమెరికా ఖచ్చితంగా బదులిస్తుందని ఆయన తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే రంగంలోకి దిగిన యూఎస్ ఎయిర్ ఫోర్స్ (అమెరికా వైమానిక దళం).. ఇరాన్‌పై ముమ్మర దాడులకు తెరలేపింది.
అమెరికా సైన్యం సరికొత్త డ్రోన్లు, శక్తివంతమైన క్షిపణులతో ఇరాన్‌లోని టెహ్రాన్ సహా పలు వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. ముఖ్యంగా ఇరాన్ సైన్యానికి కీలక స్థావరాలైన కేశమ్, బందర్ అబ్బాస్ నగరాలపై అమెరికా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. హార్ముజ్ జలసంధి సమీపంలోని కేశమ్ (ఖేష్మ్) దీవిలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా కూడా ధృవీకరించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ స్పందిస్తూ.. ఇరాన్ చేసిన అకారణ దురాక్రమణకు ఈ దాడులు తగిన సమాధానమని స్పష్టం చేయడంతో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ట్రెండింగ్ వార్తలు























