Bengaluru Woman Viral Video : బెంగుళూరులో ఓ మహిళ ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ కారు డ్రైవింగ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. కారును గుర్తించిన అధికారులు ఆమెకు ఫైన్ వేశారు. ఈ వీడియోను షేర్ చేసిన పోలీసులు వర్క్‌ఫ్రమ్ హోమ్ చేయండి కానీ వర్క్‌ఫ్రమ్ కారు మాత్రం వద్దని హితవు పలికారు.
సదరు మహిళ తన ల్యాప్‌టాప్‌ను కారు స్టిరింగ్‌పై పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ కారు నెంబర్ ఆధారంగా ఆమెను గుర్తించిన పోలీసులు ఆమెకు వెయ్యి రూపాయల ఫైన్ వేశారు. నెటిజన్ల నుంచి విమర్శలు వస్తాయని గ్రహించి ఆమె పనిచేస్తూ డ్రైవింగ్ చేసిన వీడియోతోపాటు, ఫైన్ తీసుకుంటున్న వీడియో కూడా షేర్ చేసారు.
ఇలా పని చేస్తూ డ్రైవింగ్ చేయడంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 90 గంటల పని విధానంలో ఇలాంటివే జరుగుతాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బెంళూరులో ఉన్న ట్రాఫిక్ పరిస్థితికి ఇది అద్దం పడుతుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
ఈ వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. ఇలా కారు డ్రైవింగ్ చేస్తూ స్టీరింగ్‌పై ల్యాప్‌టాప్ పెట్టుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దానికి రుజువుగా వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. వీళ్లపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసింది - ఆ భర్త ఉద్యోగం పోయేలా చేశాడు - టిట్ ఫర్ టాట్ !