Atishi Resigns As Delhi CM | న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. భారీ స్థానాలు నెగ్గి దశాబ్దం పాటు అధికారంలో ఉన్న ఆప్ ఓటమితో ఢిల్లీ సీఎం అతిషి మార్లెనా సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లు కైవసం చేసుకోగా, ఆప్ 22 స్థానాలకు పరిమితమైంది. అతిషి మార్లెనా కల్కాజీ నుంచి గెలుపొందారు. ఎన్నికల్లో ఆప్ ఓటమిని అంగీకరించిన అతిషి ఆదివారం నాడు ఢిల్లీ రాజ్ భవన్‌కు వెళ్లారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు తన రాజీనామా లేఖ సమర్పించారు.
అనంతరం రాజ్ నివాస్ నుంచి ఆప్ నేత, మాజీ సీఎం అతిషి సైలెంట్‌గా వెళ్లిపోయారు. మీడియా ఆమెను సంప్రదించే ప్రయత్నం చేసినా ఒక్కమాట సైతం మాట్లాడకుండా అతిషి అక్కడి నుంచి తన వాహనంలో వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు బీజేపీ సీఎంగా ఎవరిని ప్రకటిస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం రేసులో అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ ముందున్నారు.