Amit Shah Vs Tamilasai: చంద్రబాబు ప్రమాణ స్వీకారం స్టేజ్‌పై తమిళిసైకు అమిత్‌షా వార్నింగ్!

Former Telangana Governor Tamilisai: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్‌గా మారుతోంది. తెలంగాణ మాజీ గవర్నర్‌కు అమిత్‌షా క్లాస్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Continues below advertisement

Former Telangana Governor Tamilisai: ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్రం మంత్రులు, బీజేపీ సీఎంలు, ఇతర నేతలు తరలి వచ్చారు. ఈ మధ్య కాలంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా వచ్చారు. ఆమె సభావేదికపై వచ్చినప్పుడు హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆమె జరిపిన సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.

Continues below advertisement

స్టేజ్‌పైకి వచ్చిన తమిళిసై అందరికీ అభివాదం చేసి వెళ్లిపోతున్నటైంలో ఆమెను వెనక్కి పిలిచిన అమిత్‌షా మాట్లాడారు. కోపంగా ఏదో చెప్పారు. దానికి ఆమె సమాధానం ఇస్తుండగానే ఆపి మరీ క్లాస్ తీసుకున్నారు.  పక్కనే ఉన్న వెంకయ్య నవ్వును దాచుకొని ఉండిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. 

లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. అక్కడ అన్నమలైను చూపించి ఓట్ల వేటలో పడ్డ బీజేపీ చతికిలపడింది. తమిళిసై కూడా సౌత్‌ చెన్నై నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఫలితాలు ఇలా వచ్చిన వేళ స్థానిక బీజేపీ నేతలపై కొన్ని కామెంట్స్ చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాము తమిళనాడులో ఓడిపోవడానికి అన్నమలై నోటి దురుసే కారణమని అన్నారు. ఆయన్ని అదుపులో పెట్టగలిగి ఉంటే కచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేవి అన్నారు. అన్నడీఎంకేతో పొత్తు పెట్టుకొని ఉన్నా కాస్త మెరుగైన ఫలితాలు సాధించేవాళ్లమని కామెంట్ చేశారు. ఇప్పుడు ఏపీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో తమిళసైకి అమిత్‌షా క్లాస్ తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణమనే వాదన విపిస్తోంది. 

Continues below advertisement