Air India New Look:
ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్..
ఎయిర్ ఇండియా (Air India)ని టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తరవాత సంస్థలో పలు మార్పులు చేర్పులు చేస్తోంది. విమానాల డిజైన్‌నీ మార్చేస్తోంది ఎయిర్ ఇండియా. కొత్త ఫ్లైట్స్‌నీ రెడీ చేస్తోంది. ఈ క్రమంలోనే A350 Planes ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. వీటి డిజైన్ ఫస్ట్ లుక్‌ని అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే బ్రాండ్ లోగోని "The Vista"గా మార్చేసింది. ఫ్లైట్‌ల కలర్‌లోనూ మార్పులు చేసింది. ఫ్రాన్స్‌లోని టౌలౌజ్ (Toulouse)లో ఈ కొత్త విమానాలు తయారవుతున్నాయి. ఆ వర్క్‌షాప్‌లో దాదాపు ఖరారైన A350 ఫ్లైట్ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది ఎయిర్ ఇండియా. ఈ వింటర్ సీజన్‌లో ఇవి అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.
ఎయిర్ ఇండియాలో పాత ఫ్లైట్‌లన్నింటినీ రీఫర్బిష్ చేసేందుకు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతోంది కంపెనీ. దాదాపు 400 మిలియన్ డాలర్ల మేర కేటాయించింది. పూర్తిగా కొత్త లుక్‌తో ప్రయాణికులను ఆకట్టుకోనుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి పైస్థాయి వరకూ అన్ని డిపార్ట్‌మెంట్‌లలోనూ సంస్కరణలు చేపట్టాలన్నదే సంస్థ లక్ష్యం.
"ఎయిర్ ఇండియాని అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్య. అందుకు తగ్గట్టుగానే పని చేస్తున్నాం. ప్రపంచ దేశాల నుంచి వచ్చే అతిథులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాం. గ్లోబల్ మార్కెట్‌లో ఇండియాని ఉన్నతంగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నాం."
- క్యాంప్‌బెల్ విల్సన్, ఎయిర్ ఇండియా సీఈవో
2025 నాటికి ఎయిర్ ఇండియా కొత్త లోగో అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టులోనే కీలక ప్రకటనలు చేసింది ఈ సంస్థ. ఎయిర్‌బస్, బోయింగ్‌తో భారీ డీల్స్ కుదుర్చుకోనున్నట్టు వెల్లడించింది. ఆ మేరకు ఒప్పందాలు కూడా కుదిరాయి.
గతేడాది టాటా సంస్థ చేతికి వెళ్లిన ఎయిర్ ఇండియా కంపెనీ తన కొత్త లోగోను ఆగస్టు 10వ తేదీన ఆవిష్కరించింది. ఢిల్లీలో జరిగిన లైవ్ ఈవెంట్‌లో ఈ కొత్త లోగోను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆవిష్కరించారు. ఇది ఎయిర్‌లైన్ కొత్త ఐడెంటిటీ, రీబ్రాండింగ్‌లో భాగమని అన్నారు. ‘అవధుల్లేని అవకాశాలు’ను ఈ లోగో ప్రతిబింబిస్తుందని అన్నారు. ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే ప్రయాణం మొదలైందని చెప్పారు. ఎయిర్ ఇండియా కొత్త లోగో సింబల్ కు ‘ది విస్టా’ అని పేరు పెట్టారు. ఈ లోగోలో గోల్డెన్, రెడ్, పర్పుల్ కలర్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. వచ్చే 15 నెలలల్లో అత్యుత్తమ అనుభవం, సాంకేతికత, కస్టమర్ సర్వీస్, సేవలతో ఎయిర్ ఇండియాను ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని చెప్పారు. గత 12 నెలల్లో, తాము అన్ని విషయాల్లోనూ సంస్థను మెరుగు పరిచామని అన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లీట్ ను కూడా గ్లోబల్ స్టాండర్డ్‌గా తయారు చేసేలా మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని అన్నారు.
Also Read: Delhi Air Quality: మరింతగా దిగజారిన ఢిల్లీ గాలి నాణ్యత, 231 AQIగా నమోదు