Aditya L1: సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మొదటి శాటిలైట్‌ ఆదిత్య-L1 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఇస్రో చేపట్టిన నాలుగోసారి  ఆదిత్య-L1 భూ కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతం అయింది. ప్రస్తుతం ఆదిత్య-ఎల్‌1 శాటిలైట్‌ కొత్త కక్ష్య 256 కిమీ x 121973 కిమీ కక్ష్యలో తిరుగుతోంది. ఈ మేరకు ఇస్రో సోషల్ మీడియా ఎక్స్‌(ట్విటర్) వేదికగా వెల్లడించింది.






‘బెంగళూరులోని ఇస్రో డీప్‌ స్పేస్‌ స్టేషన్‌ ప్రధాన కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఆదిత్య-ఎల్‌1 నాలుగో భూ కక్ష్య పెంపు విజయవంతం అయింది. సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌- షార్‌, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో కేంద్రాల నుంచి ఈ ఆపరేషన్‌ను ట్రాక్‌ చేశామని. ప్రస్తుతం కొత్త కక్ష్య 256 కిమీ x 121973 కిమీ కిలో మీటర్ల కక్ష్యలో ఆదిత్య-L1 తిరుగుతున్నట్లు ఇస్రో తెలిపింది. తదుపరి భూ కక్ష్య పెంపు ప్రక్రియ ఈనెల 19న చేపట్టనున్నట్లు ఇస్రో పేర్కొంది. తదుపరి విన్యాసం భూమి నుంచి ట్రాన్స్- లాగ్రేజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ (TL1I)కు ఉంటుందని, సెప్టెంబర్ 19, దాదాపు 02:00 నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. 


భూమికి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న మొదటి సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్ (L1) చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుంచి సూర్యుడిని అధ్యయనం చేయడానికి భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఆదిత్య-L1. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C57) సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ఆదిత్య-L1 అంతరిక్ష నౌకను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆ రోజు 63 నిమిషాల 20 సెకన్ల విమాన వ్యవధి తర్వాత, ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను భూమి చుట్టూ 235x19500 కి.మీల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.


సెప్టెంబరు 3, 5, 10 తేదీల్లో మూడు విన్యాసాలను విజయవంతంగా ప్రదర్శించారు. ఈ నౌక భూమి చుట్టూ 16 రోజుల పాటు తిరగనుంది. తరువాత లాగ్రాంజియన్ పాయింట్ దిశగా ప్రయాణానికి మొదలు పెట్టనుంది. భూమి చుట్టూ నాలుగు భూ కక్ష్య విన్యాసాలు పూర్తి చేయడం ద్వారా ఆదిత్య-L1 తదుపరి ట్రాన్స్-లాగ్రాంజియన్1 చొప్పించేందుకు సిద్ధమవుతుంది. అనంతరం L1 లాగ్రాంజ్ పాయింట్ వైపు 110 రోజుల ప్రయాణాన్ని ప్రారంభింస్తుంది. L1 పాయింట్ వద్దకు చేరుకున్న మరో యుక్తి ఆదిత్య L1ని సూర్యుని మధ్య సమతుల్య గురుత్వాకర్షణ స్థానం అయిన L1 చుట్టూ కక్ష్యతో బంధిస్తుంది. హాలో కక్ష్యకు చేరుకున్న ఆదిత్య L1 గ్రహణ సమయాల్లో సైతం సూర్యుడిని నిరంతరం వీక్షిస్తుంది.  


ఇస్రో, జాతీయ పరిశోధనా ప్రయోగశాలలు, బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పూణేలోని ఇంటర్-యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (IUCAA) స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఏడు సైంటిఫిక్ పేలోడ్‌లను  ఆదిత్య L1 తీసుకువెళ్లింది. ఈ పేలోడ్లు విద్యుదయస్కాంత కణం, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్‌లను ఉపయోగించి సూర్యుడి బయటి పొరల నుంచి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌ను సేకరిస్తాయి. ప్రత్యేక వాన్టేజ్ పాయింట్ L1ని ఉపయోగించి, నాలుగు పేలోడ్‌లు సూర్యుడిని నేరుగా వీక్షిస్తాయి. 


మిగిలిన మూడు పేలోడ్‌లు లాగ్రాంజ్ పాయింట్ L1 వద్ద కణాలు, క్షేత్రాల ఇన్ - సిటు అధ్యయనాలను నిర్వహిస్తాయి, తద్వారా అంతర్ గ్రహ మాధ్యమంలో సౌరవ్యవస్థలో శాస్త్రీయ అధ్యయనాలను అందిచనున్నాయి. ఆదిత్య L1 పేలోడ్‌ల కరోనల్ హీటింగ్‌కు గల కారణాలు, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ-ఫ్లేర్ మరియు ఫ్లేర్ యాక్టివిటీస్ మరియు వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణం, కణాలు, ఉపరితల సమాచారాన్ని అందించగలవని భావిస్తున్నారు.