ABP Southern Rising Summit 2025: భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలు పాలన, అక్షరాస్యత, అభివృద్ధి, వినోదం, క్రీడలతో సహా అనేక విషయాలలో దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఈ ఐదు రాష్ట్రాల స్థిరమైన పురోగతి, సాంస్కృతిక అభివృద్ధి, సామాజికంగా తమ పాత్రను లోతుగా అర్థం చేసుకోవడానికి ABP నెట్‌వర్క్ మంగళవారం (నవంబర్ 25, 2025) నాడు చెన్నైలో Southern Rising: Future Ready AI, IT and Industry: Innovation, Inspiration, Transformation థీమ్‌తో ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025’ని నిర్వహిస్తోంది.
ABP నెట్‌వర్క్ దక్షిణ భారతదేశ రాష్ట్రాల దూరదృష్టిని, అభివృద్ధి ఆలోచనలు షేర్ చేసుకునేందుకు ఒక రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మంగళవారం నాడు చెన్నైలోని ITC గ్రాండ్ చోళాలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. ఇదివరకే ABP నెట్‌వర్క్ నిర్వహించిన రెండు సదరన్ రైజింగ్ సమ్మిట్ ఎడిషన్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా రాజకీయాలు, క్రీడలు, విజ్ఞానం, సినిమా, పరిశ్రమ, వ్యాపారం అనేక ఇతర రంగాలకు చెందిన ముఖ్యమైన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. వీరు తమ రంగాల్లో దక్షిణాది ప్రాముఖ్యతతో పాటు అనేక సమస్యలపై తమ ఆలోచనలను పంచుకుంటారు.
కార్యక్రమం ప్రారంభించనున్న ఉదయనిధి స్టాలిన్
ABP నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025’ అనేక సెషన్‌లుగా జరుగుతుంది. ఇందులో అనేక మంది వక్తలు తమ ఆలోచనలను పంచుకుంటారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ‘గ్రోత్ విత్ ఈక్విటీ ఫ్రమ్ ఎ మోడల్ స్టేట్’పై తన ఆలోచనలను పంచుకోవడంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయనిధి స్టాలిన్ తర్వాత తమిళనాడు పాఠశాల విద్యా శాఖ మంత్రి అంబిల్ మహేష్ పొయ్యమోళి విద్యను మరింత ముందుకు తీసుకెళ్లడంపై తన ఆలోచనలను షేర్ చేసుకోనున్నారు.
ఈ సమ్మిట్‌లో తెలంగాణకు చెందిన మాజీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ రాజకీయాలపై తన అభిప్రాయాలను పంచుకోనుండగా, DMK జాతీయ ప్రతినిధి సేలం ధరణిధరన్, AIADMK జాతీయ ప్రతినిధి కోవై సత్యన్, తమిళనాడు బీజేపీ ప్రతినిధి డాక్టర్ ఎస్జీ సూర్య, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి బెనెట్ ఆంటోనీ రాజ్ పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక లోతైన పునఃపరిశీలన (SIR) ప్రక్రియపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
సమ్మిట్‌లో పాల్గొనున్న మరికొందరు ప్రముఖులు
ABP నెట్‌వర్క్ నేడు నిర్వహిస్తున్న ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025’లో నటి మాళవిక మోహనన్, ప్లే బ్లాక్ సింగర్ కవితా కృష్ణమూర్తి, IIT మద్రాస్ డైరెక్టర్ ప్రొ. వి. కామకోటి, మాజీ కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ అంబుమణి రామదాస్, తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తదితరులు పాల్గొంటారు.
'ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025'ను ఎక్కడ చూడవచ్చు?
చెన్నైలో సమ్మిట్ ITC గ్రాండ్ చోళాలో ఈ ఈవెంట్ జరుగుతుంది. గత రెండు ఎడిషన్ల తరహాలోనే సదరన్ రైజింగ్ సమ్మిట్ కార్యక్రమాన్ని మీరు abpdesam.comతో పాటు www.abplive.com, news.abplive.com, abpnadu.com లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. దీనిని ABP న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు.