ABP Cvoter Opinion Poll: 

కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ట్రెండ్‌ని అంచనా వేసి ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్. ప్రసుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ సారి కూడా కాంగ్రెస్‌కే మొగ్గు చూపే అవకాశాలున్నాయని తెలిపింది ABP Cvoter Opinion Poll. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 48 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక బీజేపీకి 42 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ పోల్ వెల్లడించింది. ఇతరులకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కి 45-51 సీట్లు, బీజేపీకి 39-45 స్థానాలు దక్కనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 68 సీట్లు, బీజేపీ 15 సీట్లు గెలుచుకున్నాయి. ఇక ఓటు శాతం పరంగా చూసుకుంటే ఈ సారి కాంగ్రెస్‌కి 45.3%, బీజేపీకి 43.5% ఓట్లు దక్కే అవకాశాలున్నాయని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. 

ఎన్నికల పరంగా..ఛత్తీస్‌గఢ్‌ని మొత్తం మూడు ప్రాంతాలుగా విభజించి చూస్తారు. సెంట్రల్ ఛత్తీస్‌గఢ్, నార్త్ ఛత్తీస్‌గఢ్, సౌత్ ఛత్తీస్‌గఢ్‌గా పరిగణిస్తారు. సెంట్రల్ ఛత్తీస్‌గఢ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 43 సీట్లు వచ్చాయి. ఈ సారి అవి 36కి తగ్గిపోనున్నట్టు ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. గతంలో బీజేపీ ఇక్కడ 14 సీట్లు గెలుచుకుంది. ఈ సారి 28 సీట్లు సాధిస్తుందని తెలిపింది. ఇక ఈ ప్రాంతంలో ఇతరులకు ఒక్క సీటు కూడా రాదని అంచనా వేసింది. మొత్తంగా చూస్తే సెంట్రల్ ఛత్తీస్‌గఢ్‌లో (CHATTISGARH CENTRAL REGION) కాంగ్రెస్‌కి 34-38 సీట్లు, బీజేపీకి 26-30, ఇతరులకు ఒక సీటు దక్కే అవకాశాలున్నాయి. నార్త్ రీజియన్‌లో 14 సీట్లు ఉండగా గతేడాది కాంగ్రెస్‌కే మొత్తం 14 సీట్లు వచ్చాయి. ఈ సారి మాత్రం భారీగా తగ్గుతాయని అంచనా వేసింది ఒపీనియన్ పోల్. కాంగ్రెస్‌ ఇక్కడ నాలుగు స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఇక బీజేపీ మాత్రం ఇక్కడ ఏకంగా 10 సీట్లు సాధించుకుంటుందని వెల్లడించింది. ఇక మొత్తంగా చూస్తే...నార్త్ రీజియన్‌లో కాంగ్రెస్‌కి 2-6,బీజేపీకి 8-12,ఇతరులకు ఒక స్థానం దక్కనున్నాయి. ఓట్ల శాతాల వారీగా చూస్తే...ఈ సారి కాంగ్రెస్‌కి ఈ ప్రాంతంలో 41.2% ఓట్లు, బీజేపీకి 47.1% ఓట్లు పోల్ అవనున్నాయి. 

[Disclaimer: Current survey findings and projections are based on CVoter Pre Poll personal interviews (Face to Face) conducted among 18+ adults statewide, all confirmed voters (sample size 11,928). The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval. ]

సౌత్ రీజియన్‌లో మొత్తం 12 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కి 11 స్థానాలు దక్కాయి. ఈ సారి అవి 8కే పరిమితం కానున్నాయని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. బీజేపీకి గత ఎన్నికల్లో ఒకటే సీట్‌ రాగా..ఈ సారి మాత్రం 4 స్థానాలు దక్కనున్నట్టు తెలిపింది. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కి సౌత్ ఛత్తీస్‌గఢ్ రీజియన్‌లో 6-10, బీజేపీకి 2-6 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి.