కెనడాలో చదువుకుంటున్న కుమార్తెకు తన తండ్రి ఇచ్చిన సర్‌ప్రైజ్ వీడియోను ఓ యువతి తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఇప్పుడది వైరల్‌గా మారింది. ఫుల్ ఆఫ్ ఏమోషన్‌తో కూడిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది.
పిల్లలందరూ తల్లిదండ్రులకు ఇష్టమే. కానీ అమ్మాయిలపై తండ్రికి ఉండే ప్రేమే మాటల్లో వర్ణించలేనిది. అలాంటి తండ్రి తన కుమార్తెకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాను ఆ వీడియో షేక్ చేస్తోంది. జూన్ 2న షేర్ చేసిన ఈ వీడియో కాస్త ఆలస్యంగా నైట్టింట్ వైరల్‌గా మారింది.
శృత్వ దేశాయ్ అనే యువతి కెనడాలో చదువుకుంటున్నారు. ఆమె చదువుకుంటూనే ఓ షాపింగ్ మాల్‌లో పని కూడా చేస్తున్నారు. ఉన్నత చదువు కోసం కుమార్తెను సముద్రాలు దాటి పంపించిన తండ్రి ఆమెను చూడకుండా ఉడలేకపోయారు. అంతే వెంటనే రెక్కలు కట్టుకొని విమానంలో ఎగిరిపోయారు. కుమార్తెకు ఇలా సర్‌ప్రైజ్ ఇచ్చారు.
తండ్రి ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి కుమార్తె భావోద్వేగానికి గురయ్యారు. భారత్ నుంచి కెనడా వచ్చి నా కళ్ల ముందే ఉన్న తండ్రిని చూసి నా గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. నేను ఎప్పుడూ ఆరాధించే వ్యక్తి నా కళ్లముందు ఇలా కనిపించే సరికి షాక్ తిన్నాను. నిజంగా ఆ క్షణం మరిచిపోలేనిది. భావోద్వేగంతో నా కళ్లల్లో నీళ్లు తప్ప నా నోట మాట రాలేదు. నన్ను చూడటానికి ఇలా భారత్ నుంచి కెనడా వచ్చారంటే నమ్మలేకపోయాను. అలాంటి అపురూపమైన తండ్రిని పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నాన్న" అని దేశాయ్ పోస్ట్ చేశారు.
భారత్ నుంచి కెనడా వెళ్లిన ఆ తండ్రి నెమ్మది షాప్‌లోకి వెళ్లి కుమార్తె ముందు నవ్వుతూ కనిపించారు. తండ్రిని తన కళ్ల ముందే చూసిన దేశాయ్ ఒక్క క్షణం సైలెంట్‌గా ఉండిపోయారు. ఏమి మాట్లాడాలో తెలియ... అలా భావోద్వేగంతో ఏడుస్తూ వచ్చి తండ్రిని కౌగిలించుకున్నారు.
అక్కడ వాతావరణం చాలా గంభీరంగా మారిపోయింది. ఒకరి వైపు ఒకరు చూస్తూ భావోద్వేగంతో నిల్చుండిపోయారు. తర్వాత ఒకరినొకరు కొగిలించుకొని కన్నీంటి పర్యంతమయ్యారు. ఏడాదిన్నర క్రితం కెనడా వెళ్లిన దేశాయ్.. ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. దీంతో తన కుమార్తెను చూడకుండా ఉండలేకపోయిన ఆ తండ్రి ఇలా సర్‌ప్రైజ్ విజిట్‌తో ఆశ్చర్యపరిచారు.
ప్రేమ, భావోద్వేగంతో నిండిన ఈ వీడియోను రెండు మిలియన్ల మంది లైక్ చేశారు. వేల మంది కామెంట్స్ చేశారు. తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమను వర్ణిస్తూ కొందరు కవితలు కూడా రాశారు. కెనడాలో ఉన్న కొందరు ఎన్‌ఆర్‌ఐలు వాళ్లను కలిసేందుకు కూడా వస్తున్నామని మెసేజ్ చేస్తున్నారు. ఇవాళ మనం సంతూర్ మమ్మీకి బదులు సంతూర్ డాడీని చూస్తున్నామంటు మరికొందరు కామెంట్ చేశారు.