Trcuk Crash in Maharashtra:
ట్రక్ బీభత్సం..
మహారాష్ట్రలోని ధులే జిల్లాలోని హైవేపై ట్రక్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ముందున్న వాహనాలపై వేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా..28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ ధాబా కూడా ధ్వంసమైంది. ముంబయి - ఆగ్రా హైవేలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ట్రక్ బ్రేక్‌లు ఫెయిల్ అవ్వడం వల్ల కంట్రోల్ అవ్వలేదని, ఫలితంగా ఓ కార్, రెండు బైక్‌లతో పాటు మరో ట్రక్‌నీ బలంగా ఢీకొట్టిందని తెలిపారు. ఆ తరవాత ఓ ధాబాలోకి దూసుకెళ్లింది. ధాబా పక్కనే బస్‌స్టాప్‌లో నిలబడి ఉన్న వారిపైకి వాహనాలు దూసుకురావడం వల్ల గాయాలయ్యాయి. ప్రస్తుతానికి వీళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని వెల్లడించారు.