Tamil Nadu notifies 10 Acts without Governor assent :  గవర్నర్ లేదా రాష్ట్రపతి నుండి అనుమతి పొందకుండానే తమిళనాడు ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. భారత శాసనసభ చరిత్రలో ఇలా జరగడం తొలి సారి. అసెంబ్లీలో ఆమోదించిన చట్టాలను  గవర్నర్ ఆర్‌ఎన్ రవి నోటిఫై చేయలేదు. చాలా కాలం పెండింగ్ పెట్టి వాటిని తర్వాత రాష్ట్రపతికి పంపారు. అయితే అదే చట్టాలను  రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తిరిగి ఆమోదించింది. ఇలా చేయడం వల్ల గవర్నర్ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండో సారి అసెంబ్లీ ఆమోదించిన తర్వాత  గవర్నర్ బిల్లులను రాష్ట్రపతికి పంపడం రాజ్యాంగ విరుద్ధమని,  రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ని ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. బిల్లులు రెండో సారి అసెంబ్లీలో పాస్ అయినప్పటి నుండి ఆమోదం పొందినట్లుగా భావించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్టాలిన్ ప్రభుత్వం నోటిఫై చేసింది.  

తమిళనాడు ప్రభుత్వం , గవర్నర్ ఆర్.ఎన్. రవి మధ్య   శాసనసభ ఆమోదించిన బిల్లుల వివాదం ఉంది.  గవర్నర్ అసెంట్  ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వచ్చారు.  2020 నుండి 2023 వరకు తమిళనాడు శాసనసభ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ వద్ద ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు ఎక్కువగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వైస్-చాన్సలర్ల నియామకం, ఇతర పరిపాలనా సంస్కరణలకు సంబంధించినవి. గవర్నర్ రవి ఈ బిల్లులను ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచారు. 2023 నవంబర్‌లో, తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన తర్వాత  గవర్నర్ 10 బిల్లులను తిరస్కరించారు.  రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు. 

వాటిలో తమిళనాడు  ర శాసనసభ  10 బిల్లులను మళ్లీ ఆమోదించి మళ్లీ  గవర్నర్‌కు పంపింది. ఆయన వాటిని ఆమోదిచకుండా   మళ్లీ రాష్ట్రపతికి పంపారు, దీనిపై తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.   సుప్రీం కోర్టు గవర్నర్ రవి చర్యలను "చట్టవిరుద్ధం" , "ఏకపక్షం" అని పేర్కొంది, బిల్లులను అనవసరంగా ఆలస్యం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది.  కోర్టు ఆర్టికల్ 142 అధికారాలను ఉపయోగించి, ఈ 10 బిల్లులను 2023 నవంబర్ 18 నుండి ఆమోదించినట్లు పరిగణించాలని ఆదేశించింది