అన్వేషించండి

IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!

IMD Weather Alert Telugu States 2026:కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. రోహిణి కార్తె ఎండల మధ్య తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరిక. ఏపీ, తెలంగాణలో వాతావరణ మార్పులపై సమగ్ర రిపోర్ట్!

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రుతుపవనాలు కేరళను తాకాయి, 24-48 గంటల్లో విస్తరించనున్నాయి.
  • తెలుగు రాష్ట్రాల్లోకి జూన్ 7-10 మధ్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.
  • వాతావరణ మార్పులతో 48 గంటలు భారీ వర్షాలు, ఉరుములు పడతాయి.
  • కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రోహిణి కార్తె వేడి కొనసాగుతుంది.

IMD Weather Alert Telugu States 2026:దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, సామాన్య ప్రజలు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాల గమనంపై ఐఎండీ శనివారం ఉదయం అత్యంత కీలకమైన హెచ్చరికతో కూడిన ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. ఒక వైపు తెలుగు రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న రోహిణి కార్తె తీవ్ర వడగాల్పులు, మోరవైపు నైరుతి దిశ నుంచి వేగంగా దూసుకొస్తున్న రుతుపవన మేఘాల మధ్య ప్రస్తుతం ఆకాశంలో భయంకరమైన యుద్ధం సాగుతోంది. 

ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా రోబోయే 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. 

కేరళను తాకిన రుతుపవనాల ప్రయాణం ఎలా ఉంది?

సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకాల్సిన రుతుపవనాలు ఈసారి రెండు రోజులు ముందే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, గాలుల వేగం కారణంగా కేరళ తీరానికి చేరువయ్యాయి. రాబోయే 24 ముంచి 48 గంటల్లో ఇవి పూర్తి స్థాయిలో కేరళ అంతటా విస్తరించి అక్కడ భారీ వర్షపాతాన్ని నమోదు చేయనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన పశ్చిమ గాలుల తీవ్రత, ఉపరితల ఆవర్తనం దీనికి ఎంతగానో తోడ్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు వస్తాయి?

కేరళలోకి ప్రవేశించిన తర్వాత రుతుపవనాలు కర్ణాటక, రాయలసీమ మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి సాధారణంగా 7 నుంచి పది రోజుల సమయం పడుతుంది. ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే జూన్ 7 నుంచి జూన్ 10 మధ్య నైరుతి రుతుపవానాలు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

రోహిణి కార్తె ఎండల తీవ్రత తగ్గుతుందా?

తెలుగు రాష్ట్రాల్లో ఒక సామెత ఉంది. రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని అని మే 25వ తేదీన ప్రారంభమైన రోహిణి కార్తె జూన్ 8 వరకు కొనసాగుతుంది. ఈ పదిహేను రోజులు సూర్యుని కిరణాలు నిట్టనిలువుగా భూమిపై పడటం వల్ల ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. అయితే ఐఎండీ ఇచ్చిన అప్‌డేట్స్ ప్రకారం సామాన్యులకు కొంత ఊరట కలగబోతోంది. 

ఉపరితల ద్రోణి ప్రభావంతో ముందస్తు వర్షాలు 

రుతు పవనాలు కేరళకు చేరువవుతున్న వేల అటు బంగాళాఖాతంలో, ఇటు అరేబియా సముద్రం నుంచి తెలుగు రాష్ట్రాల వైపు తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి కారణంగా రోహిణి కార్తె ఎండల తీవ్రతకు మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. రాబోయే 48 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే ఎండల తీవ్రత పూర్తిగా తగ్గకపోయినా, సాయంత్రం వేళల్లో కురిసే వర్షాలు వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. 

తెలంగాణలో జిల్లాల వారీగా హెచ్చరికలు 

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ, పశ్చిమ జిల్లాలలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. రాబోయే 48 గంటలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఐటీ కారిడార్‌తోపాటు సిటీలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రివేళల్లో ఆకస్మిక భారీ వర్షాలు కురుస్తాయి పిడుగులు పడే అవకాశం ఉంది. 

దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు, పశ్చిమ, మధ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన  వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.   

ఒక వైపు వర్షాలు పడుతున్నా, ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో మాత్రం రోహిణి కార్తె ప్రభావం వల్ల మధ్యాహ్నం పూట వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా, కొమరం బీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. 

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?

2

ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!

3

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!

4

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న

5

భిక్షాటన నుంచి ఈగిల్ టీమ్ దాకా - హైడ్రాలో ట్రాన్స్‌జెండర్ల సగర్వ ప్రస్థానం.. గౌరవానికి కేరాఫ్ అడ్రస్‌గా యూనిఫాం !

ఆంధ్రప్రదేశ్‌లో వెదర్ రిపోర్ట్ 

అమరావతి వాతావరణ కేంద్ర తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలులు, సముద్రపు తేమ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరం వెంబడి, రాయలసీమ వ్యాప్తంగా వాతావరణం వేగంగా మారుతోంది. రుతుపవనాల రాకకు ముందు రాయలసీమలో సాధారణంగానే ముందస్తు వర్షాలు గట్టిగా పడతాయి. రాబోయే 48 గంటల్లో రాయలసీమ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉంది.రైతులు పొలం పనుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 

నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయి. అయితే అక్కడ పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. 

Frequently Asked Questions

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తాయి?

కేరళలో ప్రవేశించిన తర్వాత, రుతుపవనాలు కర్ణాటక, రాయలసీమ మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెడతాయి. ప్రస్తుత వేగాన్ని బట్టి, జూన్ 7 నుండి జూన్ 10 మధ్య తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయి?

ఉపరితల ద్రోణి ప్రభావంతో, మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా ఉన్నా, సాయంత్రానికి వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది.

తెలంగాణలోని ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది?

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవనాల ప్రభావం ఎలా ఉండబోతోంది?

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది, ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉంది. కోస్తా తీరం వెంబడి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు
మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Retirement Plan: రిటైర్మెంట్ టైంలో రూ.5 కోట్లు కావాలా? SIPని ఎలా ప్రారంభించాలి? ఏం చేయాలంటే
రిటైర్మెంట్ టైంలో రూ.5 కోట్లు కావాలా? SIPని ఎలా ప్రారంభించాలి? ఏం చేయాలంటే
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget