IGF UAE 2022: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్‌ జై శంకర్ (S Jai Shankar).. ఇండియా గ్లోబల్ ఫోరం (Indian Global Forum) యూఏఈ 2022లో ప్రసంగించారు. ప్రపంచ అభివృద్ధికి, ఈ ప్రాంతంలోని సుస్థిర శాంతికి భారత్, యూఏఈ పోషిస్తోన్న పాత్రను జై శంకర్.. వివరించారు. ఈ రోజు ప్రపంచంపై విస్తృతంగా ప్రభావం చూపే ముఖ్య అంశాలను జై శంకర్ మూడు భాగాలుగా విభజించారు.  




    • ప్రపంచీకరణ (Globalisation)- ప్రపంచంపై దాని ప్రభావం

    • రీబ్యాలెన్సింగ్ (Rebalancing), వివిధ దేశాలు, ప్రాంతాల్లో మార్పు

    • మల్టిపోలారిటీ (Multipolarity)







[quote author=   డాక్టర్ జై శంకర్, భారత విదేశాంగ మంత్రి]ప్రపంచీకరణ పెరుగుతున్న కొద్దీ మరింత రీబ్యాలెన్సింగ్, ఎక్కువ మల్టీపోలారిటీ ఉంటుంది. యూఏఈ- భారత్ ద్వైపాక్షిక సంబంధాలు ఎన్నో దశాబ్దాలుగా పాతుకుపోయి ఉన్నాయి. యూఏఈ.. భారత మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అంతేకాకుండా భారత్ రెండవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం యూఏఈనే. విదేశాలలో మరెక్కడా లేనంత ఎక్కువ భారతీయ పౌరులను కలిగి ఉన్న దేశం కూడా ఇదే. ఇది భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా మేము ఎప్పుడూ పరిగణిస్తాం. ప్రధాని మోదీ హయాంలో భారత్-యూఏఈ సంబంధాలలో అద్భుతమైన పురోగతి, మార్పు వచ్చింది. ముఖ్యంగా CEPA [UAE-ఇండియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం]తో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరిగాయి. అంతేకాకుండా అంతరిక్షం, విద్య, AI, ఆరోగ్యం, స్టార్ట్-అప్‌ల వంటి రంగాలలో కూడా ఇరు దేశాల మధ్య సహకారం ఉంది. కనుక యూఏఈతో సంప్రదాయ సంబంధాలు ఇలానే కొనసాగుతాయి.             [/quote]


మరో స్థాయికి


ఇతర దేశాలతో భారత్ సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ రాబోయే సంవత్సరాల్లో యూఏఈతో బంధాన్ని తాము మరోస్థాయికి తీసుకువెళతామని జై శంకర్ అన్నారు. రెండు దేశాలు చాలా కాలంగా ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నాయని, గత రెండు దశాబ్దాలలో మంచి సంబంధాలను నెరిపినట్లు జై శంకర్ వెల్లడించారు. ఇలాంటి ముఖ్యమైన భాగస్వాములను ప్రపంచ వేదికపైకి తీసుకురావడంలో ఇండియా గ్లోబల్ ఫోరమ్ పోషిస్తున్న పాత్రపై కూడా జై శంకర్ ప్రశంసలు కురిపించారు.


Also Read: India-UAE relationship: 'భారత్- యూఏఈది బలమైన బంధం- భవిష్యత్‌లో ప్రపంచాన్నే మారుస్తాం'