Ice cream biryani:  ఒకప్పుడు బిర్యానీ అంటే బిర్యానీ. చికెన్ లేదా మటన్ బిర్యానీలే. కానీ రాను రాను వంటల మీద ప్రయోగాలు చేసే వారు పెరిగిపోయే సరికి అనేక రకాల బిర్యానీలు పుట్టుకువచ్చాయి. చివరికి ఉలవచారు బిర్యానీ.. అవకాయ బిర్యానీలు వచ్చాయి. వీటన్నింటినీ ఎలాగోలా జనం భరిస్తున్నారనిఎవరూ ఊహించని విధంగా బిర్యానీని ఖూనీ చేస్తూ కొత్త కొత్త ప్రయోగాలతో వస్తున్నారు. ముంబైలో ఓ వంటల పోటీకి వచ్చిన మహిళ చేసిన బిర్యానీ చూసి.. పాపం అనుకోవాలా.. మహా పాపం చేసిందని అనుకోవాలో చాలా మందికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆమె చేసింది ఐస్‌ క్రీమ్ బిర్యానీ.  



మీరు సరిగ్గానే చదివారు. ఆమె చేసింది అచ్చంగా ఐస్ క్రీమ్ బిర్యానీ. ముంబైలో వంట నేర్పే ఓ కాలేజీ.. ఫుడ్ కాంపిటిషన్ పెట్టింది. ఈ పోటీలో హీనా కసుర్ అనే మహిళ కూడా పాల్గొన్నారు. నిర్ణేతలు అందరు చేసిన వంటలను పరిశీలిస్తున్న కర్మంలో హీనా వంటను పరిశీలించారు. ఆమె వంట చేసిన పాత్ర ఓపెన్ చేయగానే.. కింద బిర్యానీ పైన ఐస్ క్రీమ్ కనిపించింది. పొరపాటున పెట్టారేమో అని నిర్ణేతలు అనుకున్నారు. కానీ ఆ వంట గురించి హీనా వివరించేసరికి ఆయనకు ఏదో అర్థం కాని ఫీలింగ్ కలిగింది. తాను ఐస్ క్రీమ్ బిర్యానీ చేశానని ఎలా చేశానో కూడా వివరించారు. అందులో పెద్ద మ్యాటర్ ఏమీ లేదు. మొత్తం బిర్యానీ వండి పైన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ పెట్టింది.   



Also Read: Asia's Worst City - Bengaluru : 'ఈ నగరానికి ఏమైంది?' - ఏటా 132 గంటలు ట్రాఫిక్‌లోనే, ఆసియాలోనే అత్యంత అధ్వానమైన నగరాల్లోనే..