Hyundai Creta Trims Latest News:  పండుగ సీజ‌న్ స‌మీపిస్తుండ‌టంతో చాలా కంపెనీలు త‌మ కొత్త ఉత్ప‌త్తుల‌ను మార్కెట్లోకి వ‌దులుతున్నాయి. తాజాగా ఇదే కోవ‌లో హ్యుంద‌య్ కార్ల కంపెనీ కూడా త‌మ మూడు మోడ‌ళ్ల‌ను ప‌రిచ‌యం చేసింది.  హ్యుందాయ్ తన ప్రఖ్యాత కాంపాక్ట్ SUV క్రెటా భారతదేశంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, కొత్త ట్రిమ్స్‌ను పరిచయం చేసింది. కింగ్, కింగ్ నైట్, కింగ్ లిమిటెడ్ ఎడిషన్ పేర్ల‌తో మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఇందులో కింగ్ వేరియంట్ ఇప్పుడు రెగ్యులర్ క్రెటాలో టాప్-స్పెక్ వేరియంట్‌గా నిలిచిందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కొత్త బ్లాక్ మ్యాట్ క‌ల‌ర్ తో అందుబాటులో ఉంది. దీనిలో కొత్తగా వచ్చిన ఫీచర్లు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి.  డ్రైవర్ సీట్‌కు మెమొరీ ఫంక్షన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్ ప్లే, డాష్‌క్యామ్, అలాగే సీటు వెనుక భాగంలో రీట్రాక్టబుల్ ట్రే వంటివి ఉన్నాయి. కింగ్ లిమిటెడ్ ఎడిషన్ కూడా అదే ఫీచర్లతో వస్తోంది కానీ అదనంగా సీట్ బెల్ కవర్లు, హెడ్‌రెస్ట్ కుషన్స్, మ్యాట్స్ , కీ కవర్‌లపై ప్రత్యేకమైన ‘కింగ్’ బ్రాండింగ్ ఉంటుంది. ఇక కింగ్ నైట్ ట్రిమ్‌లో కూడా ఇదే ఫీచర్లు ఉంటాయి కానీ ఇది ప్రత్యేకంగా 18-ఇంచుల బ్లాక్ అలాయ్ వీల్స్ ,‘నైట్’ బ్యాడ్జింగ్ తో వస్తుండటంతో చాలా ఆక‌ర్ష‌ణీయంగా ఉంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. 

ధ‌ర‌ల వివ‌రాలు..ధరల విషయానికొస్తే, క్రెటా కింగ్ వేరియంట్ ధరలు ఈకింది విధంగా ఉన్నాయి. పెట్రోల్ MT ₹17.89 లక్షలు, CVT ₹19.35 లక్షలు; డీజిల్ MT ₹19.47 లక్షలు, AT ₹20.42 లక్షలు; టర్బో పెట్రోల్ DCT ₹20.61 లక్షలుగా కంపెనీ నిర్దారించింది.  క్రెటా కింగ్ నైట్ ధరలు కూడా కంపెనీ విడుద‌ల చేసింది. పెట్రోల్ CVT ₹19.49 లక్షలు, డీజిల్ AT ₹20.92 లక్షలు ఉండ‌గా,  కింగ్ లిమిటెడ్ ఎడిషన్ ధరలు.. పెట్రోల్ CVT ₹19.64 లక్షలు, డీజిల్ AT ₹20.92 లక్షలుగా కంపెనీ నిర్ణ‌యించింది. క్రెటా N లైన్ వేరియంట్లలో కూడా డ్యుయల్ జోన్ ఆటో AC, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్ ప్లే, డాష్‌క్యామ్ వంటి కొత్త ఫీచర్లు జోడించబడ్డాయి. N లైన్ N8 DCT ధర ₹19.70 లక్షలు, N10 MT ₹18.46 లక్షలు, DCT ₹20.66 లక్షలుగా కంపెనీ నిర్ణ‌యించింది. 

మూడు ఇంజిన్ల ఆప్ష‌న్..పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, క్రెటా మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది. 1.5L నాచురల్ పెట్రోల్ (115PS/144Nm), 1.5L డీజిల్ (116PS/250Nm), 1.5L టర్బో పెట్రోల్ (160PS/253Nm) ఫీచ‌ర్ల‌తో ల‌భిస్తుంది. అలాగే  వేర్వేరు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. క్రెటా , క్రెటా N లైన్ మోడల్స్ ప్రధానంగా Kia Seltos, Maruti Grand Vitara, Toyota Hyryder, Honda Elevate, Skoda Kushaq , Volkswagen Taigun వంటి SUV మోడల్స్‌కు పోటీగా నిలుస్తున్నాయని కంపెనీ విశ్వాసంగా ఉంది. పై ధరలన్నీ  పాన్-ఇండియా ఎక్స్-షోరూమ్ ధ‌ర‌లుగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.