Hyderabad Boy Dies while flying Kite: సంక్రాంతి పండుగ సమిస్తున్న వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరవేస్తూ ఓ బాలుడు భవనం పై నుంచి కిందపడి దుర్మరణం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ చెందిన ఒంగోలు జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా తాపీ మేస్త్రి బతుకుతెరువు కోసం ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి నాగోల్ లో ఇంటిని అద్దెకి తీసుకొని భార్య ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర్లు.. కుమారుడు శివకుమార్(13) నాగోల్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు.


సంక్రాంతి సెలవులు రావడంతో తోటి స్నేహితులతో శనివారం సాయంత్రం ఇంటిపైకి ఎక్కి కైట్ ఎగరేస్తున్నాడు ఈ సమయంలో గాలి రాకపోవడంతో పక్క బిల్డింగ్ పైకి వెళ్లి తోటి స్నేహితులతో ఉండగా ఆ ఇంట్లో ఉన్న కుక్క అతడి పైకి ఎగబడింది. దీంతో భయపడిన శివకుమార్ కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు వెనక్కి వెళ్ళడంతో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు... కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..