Murrel Fish vs African Catfish: మహారాష్ట్రంలో భారీగా థాయ్‌మాంగూర్‌ ఫిష్‌ అంటే క్యాట్‌ఫిష్‌ను అధికారులు పట్టుకున్నారు. లారీ కొద్ది చేపలని పూడ్చి పెట్టారు. ఇవి తింటే క్యాన్సర్ వస్తుందని అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే చూడటానికి ఒకేలా ఉండే కొరమీను, క్యాట్‌ఫిష్ మధ్య తేడాని ఎలా గుర్తించాలో చూద్దాం. 

Continues below advertisement

ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియుల ఇళ్లల్లో ముక్క ఉడకాల్సిందే. చికెన్, మటన్ కంటే చాలా మంది చేపల వంటకానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ తెలుగువారికి కొరమీను చేపలంటే ప్రామం. అద్భుతమైన రుచితోపాటు, ఆరోగ్యానికి మంచి చేసే ఈ చేపలను వైద్యులు కూడా సిఫార్సు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌కు వెళ్లే వినియోగదారులకు ఒక నమ్మలేని షాకింగ్ నిజం ఎదురవుతోంది. మీరు మార్కెట్‌లో కిలోకి 600 నుంచి 900 వరకు భారీ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్న చేప నిజంగానే అసలైన కొరమీనేనా లేకా ప్రాణాంతకమైన క్యాట్ ఫిష్షా అనే అనుమానం కలగక మానదు. ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని చాలా మది క్యాట్‌పిష్‌ను కొరమీను అంటూ అమ్మకాలు చేస్తున్నారు. 

భారత్‌ ప్రభుత్వం పూర్తిగా నిషేధించిన అత్యంత విషపూరితమైన థాయ్‌ మాంగూర్‌ చేపలు కొరమీను ముక్కలుగా వినియోగదారుల నెత్తిన రుద్దుతున్నారు. చూసేందుకు దాదాపు ఒకే రూపురేఖలతో ఉండే ఈ నకిలీ కొరమీనును ఆహారంగా తీసుకోవడంవల్ల క్యాన్సర్‌, కాలేయ సంబంధిత ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Continues below advertisement

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌, కేంద్ర మత్స్యశాఖలు దేశంలో ఈ చేపల పెంపకాన్ని, విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది. అయినా చాలా మంది వ్యాపారులు దొంగచాటున విక్రయిస్తున్నారు. దీని వెనుక పెద్ద మాఫియా ఉంది. గుట్టుచప్పుడు కాకుండా మురికి కాలువల్లో, డ్రైనేజీల్లో, నీటి గుంటల్లో వీటిని పెంచుతున్నారు. 

థాయ్‌ మాంగూర్‌ చేపలు కేవలం 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే కేజీల కొద్ది బరువు పెరుగుతాయి. వీటికి ప్రత్యేకంగా ఎలాంటి ఆహారం వేయాల్సిన పని లేదు. కుళ్లిన మాంసం, కోళ్ల వ్యర్థాలు, డ్రైనేజీ మురుగు నీటిలో ఉండే ఫుడ్ తింటూ పెరుగుతాయి. కొన్నిప్రాంతాల్లో లైవ్ ఫిష్‌ను అమ్ముతుంటే, మరికొన్నిప్రాంతాల్లో తలలు తీసేసి మిగతా భాగాన్ని కొరమీనుగా చెప్పి విక్రయిస్తుంటారు. 

ఆరోగ్యంపై దాడి చేసే థాయ్‌ మాంగూర్‌ ఫిష్‌ 

ఇవి మురుగు నీటిలో, ఆక్సిజన్ లేని ప్రాంతాల్లో పెరగడం వల్ల అత్యంత ప్రమాదకరమైన లోపాలు వీటి శరీరంలో నిల్వ అవుతాయి. ఆర్సెనిక్, సీసం, పాదరసం, కాడ్మియం, ఐరన్ వంటి ప్రమాదకరమైన లోపాలు ఉంటాయి. ఇవి మనిషి బాడీలోకి వెళ్లి రోగనిరోధక శక్తిని నాశనం చేస్తాయి. 

ఈ చేపల కణజాలాల్లో పేరుకుపోయే టాక్సిన్లు, కార్సినోజెన్లు గ్యాస్ట్రిక్, చర్మ క్యాన్సర్‌ కణాలను ఉత్పత్తి చేస్తాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపునొప్పి, లీవర్ డ్యామేజ్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌, చర్మ రోగాలు వస్తాయి. గర్భిణీలు, చిన్న పిల్లలు తీసుకుంటే నరాలబలహీనత, మెదడు ఎదుగుదల లోపం, శారీరక వైకల్యం వచ్చే ప్రమాదం  ఉంది. 

చేపని టచ్ చేసి కనిపెట్టే నిజమైన కొరమీను గుర్తించవచ్చు

చేపలను కొనుగోలు చేసేటప్‌ుడు కేవలం పైపైన చూసి మోసపోతుంటాం.  టచ్ చేస్తే చాలా వరకు మంచి చేపలను గుర్తించవచ్చు. కొరమీను చర్మంపై గట్టి, నిండైన పొలుసులు ఉంటాయి. పద్ధతిగా అమర్చి ఉంటాయి. పట్టుకున్నప్పుడు చేతికి పొలుసుల గరుకుదనం, గట్టిదనం తెలుస్తుంది. అయితే క్యాట్‌ఫిష్‌ పట్టుకొని చూస్తే వాటికి పొలుసులు ఉండవు. చర్మం ఎక్కువ జిగురుగా, బంకగా, ఉంటుంది. మార్కెట్‌లో పొలుసులు లేకుండా నల్లటి నిగనిగలాడే చేపలు కనిపిస్తే మాత్రం అవి కొరమీను కావని గుర్తు పెట్టుకోండి. 

తల భాగం గమనిస్తే తెలుస్తుంది!

చేప తల భాగాన్ని గమనిస్తే ఆ చేప జాతి ఏంటో క్షణాల్లో తెలిసిపోతుంది. కొరమీనును అంతర్జాతీయంగా స్నేక్ హెడ్ ఫిష్ అంటారు. అంటే పాము తల ఆకారంలో చదునుగా ఉంటుంది. దీని మూతి వద్ద ఎలాంటి మీసాలు ఉండవు. తలపై కూడా పొలుసులు ఉంటాయి. క్యాట్‌ఫిష‌ తలభాగం చాటలాగా చాలా వెడల్పుగా ఉంటుంది. చదునుగా ఉంటుంది. గట్టి ఎముక నిర్మాణం కలిగి ఉంటుంది. దీని మూతి వద్ద 4 జతల పొడవైన మీసాలు ఉంటాయి. 

శరీర నిర్మాణం పరిశీలన 

కొరమీను వీపుపై ఉండే రెక్క పొడవుగా ఉన్నప్పటికీ తోకకు వరకు ఉండదు. దీని తోక భాగం విడిగా స్పష్టమైన గుండ్రటి ఫ్యాన్ ఆకారంలో ఉంటుంది. కొరమీను శరీరంపై నలుపు, ముదురు పచ్చ లేదా గోధుమ రంగు చారలు ఉండి, పొట్ట భాగం తెల్లగా లేత పసుపు రంగులో ఉంటుంది. థాయ్‌ మాంగూర్ ఫిష్‌ వీపుపై పెద్ద రెక్క ఉంటుంది. ఇది తల నుంచి తోక వరకు ఉంటుంది. దీని బాడీ పూర్తిగా నల్లగా, బూడిద రంగులో ఉంటుంది. 

వండేటప్పుడు కూడా తేడా తెలుసుకోవచ్చు

కొరమీను ముక్కలుగా కోసినప్పుడు దాని మాంసం తెల్లగా, గట్టిగా ఉంటుంది. ఒకే ముల్లు ఉంటుంది. చిన్న ముల్లులు ఉండవు. వండుతుండగా ముక్కలు విరిగిపోవు. థాయ్ మాంగూర్ ముక్కలు తెల్లగా ఉండదు. ఇది ఎర్రగా, లేదా ముదురు రంగులో ఉంటుంది. వండేటప్పుడు ముక్కలు త్వరగా మెత్తబడి విరిగిపోతాయి. నీచు వాసన వస్తుంది.