Brutal cruelty towards employees: సమాజం ఆధునికంగా మారుతున్న కొద్దీ.. అనాగరికంగా మారే వారూ పెరిగిపోతున్నారు. కేరళలోని ఓ కంపెనీ యజమానులు తమ ఉద్యోగులను మనుషులుగా చూడటం లేదు. కుక్కలుగా చూస్తున్నారు. అది కూడా చూపులతోనే కాదు.. చేతలతో కూడా..

కేరళలోని కొచ్చిలో హిందూస్థాన్ పవర్ లింక్స్ అనే కంపెనీలో ఉద్యోగులను కుక్కల మాదిరిగా వేధిస్తున్నారు.  కంపెనీలో టార్గెట్లను సాధించని ఉద్యోగులపై మానేజర్ క్రూరంగా వ్యవహరించినట్లు  వీడియోలు వెలుగులోకి వచ్చాియి. ఉద్యోగులను  వారిని కుక్కల బెల్ట్‌తో కట్టి, నాలుగు కాళ్లపై నడిపించడం, నాణేలను నోటితో తీయమని బలవంతం చేయడంతో పాటు కుక్కలు చేసే పనులను చేయాలని ఉద్యోగుల్ని ఒత్తిడి  చేశారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

హింసకు గురైన వారంతా మార్కెటింగ్ ఉద్యోగులు. వారంతా డోర్ టు డోర్  వెళ్లి కంపెనీై వస్తువులను అమ్మాల్సిన ఉద్యోగంలో ఉన్నారు. ఆ రోజు టార్గెట్లు సాధించలేని వారికి ఇలాంటి శిక్ష విధిస్తారు. తర్వాత రోజు కుక్కబతుకు బతకకుండా ఉండాలంటే టార్గెట్లు రీచ్ అయి వస్తారని కంపెనీ యాజమాన్యం భావన అని చెబుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితులు భయపడుతున్నారు. స్పందించడం లేదు. వీరంతా పదివేల లోపు జీతానికి పని చేస్తున్నవారే.  

ఈ కంపెనీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో  కేరళ లేబర్ మినిస్టర్ వి. శివన్‌కుట్టి వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. కంపెనీ యజమాని గతంలో లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన వ్యక్తి అని గుర్తించారు.  ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉద్యోగుల హక్కులపై చర్చ ప్రారంభమయింది.  అయితే, కంపెనీ యజమాని ఈ ఆరోపణలను ఖండించారు.  ఈ ఘటనకు తమ కంపెనీకి సంబంధం లేదని పోలీసులకు చెప్పారు.కానీ ఆయన అబద్దం చెబుతున్నారని స్పష్టంగా తెలిసిపోతోందని అంటున్నారు.