AP BJP Vishnu: భారత హిందూ దేవుళ్లను కించ పర్చడం పాశ్చాత్య బహుళజాతి సంస్థలకు కామన్ గా మారిపోయింది.గతంలో ఎన్నో సార్లు ఇలా చేస్తే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ ఎప్పటికప్పుడు అదే కొనసాగిస్తున్నారు. తాజాగా వాల్ మార్ట్ సంస్థ హిందూ దేవుళ్లను ఉపయోగించుకుని కొన్ని అభ్యంతరకరమైన వస్తువులను మార్కెట్ చేస్తోంది. అండర్ వేర్లు, చెప్పులు, స్విమ్ సూట్లను పూర్తిగా హిందూ దేవుల బొమ్మలతో డిజైన్ చేయించి వాటితో మోడలింగ్ కూడా  చేయించారు. అమ్మకానికి పెట్టారు.               


Also Read: మరో 50 ఏళ్లలో అంతరించిపోనున్న సగం దేశాలు - ఎలాన్ మస్క్ హెచ్చరిక - ఇది వంద శాతం నిజం !


వాల్ మార్ట్ తీరుపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ అంశంపై సోషల్ మీడియాలో స్పందించారు. వాల్ మార్ట్ తక్షణం క్షమాపణలు చెప్పి ఆ ఉత్పత్తుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హిందూత్వాన్ని కించ పరిచే ఎలాంటి ఘటనలనూ తాము సహించేది లేదని హెచ్చరించారు.  






వాల్ మార్ట్ సంస్థ అమెరికాకు చెందినది.ఇండియాలోనూ పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున మెగా స్టోర్లను నిర్వహిస్తోంది. ఇందులో ఇతర దేశాల నుంచి తెచ్చిన వస్తువులను అమ్మతున్నారు. ఇలా హిందూ దేవుళ్లను కించ పరిచేలా ఉండే డిజైన్లలో రూపొందించిన దుస్తులు, చెప్పులను అమ్మడం తరచూ చేస్తున్నారు. గతంలో ఇలాగే వివాదాస్పదం అయితే వెనక్కి తీసుకున్నారు. గతంలో అమెజాన్ లోనూ ఇలాంటివి అమ్మకానికి పెట్టేవారు. కానీ దేశంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని ఉపసంహరించుకున్నారు. మరోసారి అలాంటివి అమెజాన్ లో కనిపించనివ్వబోమని హామీ ఇచ్చారు.             


Also Read:  విమానంలో ఆ జంట ఆగలేకపోయారు - నింగి నేల మధ్య పని పూర్తి చేశారు - అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !


 అయితే ఇప్పుడు వాల్ మార్ట్ మాత్రం ఇలాంటి పనులు ఆపకపోవడం వివాదాస్పదమవుతోంది. హిందూత్వ వాదులు వాల్ మార్ట్ ను క్షమించే పరిస్థితి కనిపించడం లేదు. అయితే వివాదం అయిన తర్వాత క్షమాపణలు చెప్పి ఉపసంహరించుకోవడం ఖాయమే.కానీ ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి చేసి.. హిందువుల మనోభావాలను కించ పర్చి.. ఆ తర్వాత తీరికగా ఉపసంహరించుకుంటామని చెప్పడం కూడా ఓ కుట్రలో భాగమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.