Happiest country Finland offering permanent residency for Indians ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం భారతీయులకు ఆహ్వానం పలుకుతోంది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుగాంచిన ఫిన్‌లాండ్, భారతీయులకు శాశ్వత నివాసం (పర్మనెంట్ రెసిడెన్సీ) అవకాశాలను అందించేందుకు ముందుకు వచ్చింది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం, ఫిన్‌లాండ్ 2025లో కూడా ప్రపంచంలో మొదటి స్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ దేశం ఇప్పుడు భారతీయ IT ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు, విద్యార్థులు , ఇతర నైపుణ్యాలు కలిగిన వారికి సులభంగా వీసాలను అందిస్తోంది. యూరప్‌లో జీవించాలనుకునే భారతీయులకు గొప్ప అవకాశాన్ని సృష్టిస్తోంది. ఫిన్‌లాండ్ ప్రభుత్వం ప్రకారం శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు తప్పనిసరి. బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ లేదా 3-5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. IT, ఇంజనీరింగ్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో నైపుణ్యాలు ముఖ్యం. ఫిన్నిష్ లేదా స్వీడిష్ భాషల్లో ప్రాథమిక స్థాయి (A2 లెవల్) తెలియాలి. ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి. ప్రతి నెల 800 యూరోలు అంటే సుమారు 85,000 రూపాయల సంపాదనా సామర్థ్యం ఉండాలి. కుటుంబ సభ్యులు ఉంటే అదనపు ఆదాయం అవసరం. 18-45 సంవత్సరాల మధ్య వయసు ఉండటం మంచిది, కానీ పరిమితి లేదు. క్రిమినల్ రికార్డు ఉండకూడదు. అలాగే ఆరోగ్యంగా ఉండాలి.
ఇదంతా భారతీయుల కోసమే రూపొందించారు. ఫిన్‌లాండ్‌లో IT , టెక్నాలజీ రంగాల్లో భారతీయులకు డిమాండ్ ఉంది. 2024లో ఫిన్‌లాండ్ 5,000 మంది భారతీయులకు వర్క్ వీజాలు జారీ చేసింది. 2025లో ఇది మరింత పెరగనుంది. మొదట వర్క్ లేదా స్టూడెంట్ వీసా తీసుకుని, 2-3 సంవత్సరాల తర్వాత శాశ్వత నివాసానికి మార్చుకోవచ్చు. ఈ పథకం 2025 చివరి వరకు అందుబాటులో ఉంటుంది.
ఫిన్ ల్యాండ్‌లో ఉచిత ఆరోగ్య సేవలు, ఉత్తమ విద్య, సుందరమైన ప్రకృతి నగరాలు ఉంటాయి. హెల్సింకి , టామ్పెరే వంటి నగరాల్లో టెక్ జాబ్స్ పుష్కలంగా ఉన్నాయి. సగటు వేతనం 3,500 యూరోలు ఉంటుంది. అంటే సుమారు నెలకు 3 లక్షలు ఉంటుంది. భార్య/భర్త, పిల్లలకు కూడా నివాసం మరియు పని అవకాశాలు ఉంటాయి. 5 సంవత్సరాల తర్వాత ఫిన్నిష్ పౌర్షత్వం కోసం దరఖాస్తు చేయవచ్చు.
"భారతీయుల నైపుణ్యాలు మా ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేస్తాయి. మేము వారిని స్వాగతిస్తున్నాం" అని ఫిన్‌లాండ్ ఇమ్మిగ్రేషన్ మంత్రి పీర్ టామ్ మినర్వా ప్రకటించారు. మరిన్ని వివరాలకు, అధికారిక వెబ్‌సైట్ migri.fiని చూడవచ్చు.