Gujarat HC dissolves marriage citing cruelty: ఇటీవలి కాలంలో కోర్టుల్లో భరణం అంశంలో జరుగుతున్న వాదనలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మాత్రం రివర్స్. గుజరాత్ హైకోర్టులో జరిగిన వాదనల్లో ఆ భార్య తన భర్త పెడుతున్న టార్చర్ ను నిరూపించింది. గుజరాత్ హైకోర్టు వెంటనే విడాకులు మంజూరు చేయడమే కాదు.. నెలకు లక్ష భరణం కూడా మంజూరు చేసింది.
ముంబైకి చెందిన పైలట్ , అహ్మదాబాద్‌కు చెందిన టీచర్ 2023 మేలో వివాహం చేసుకున్నారు. ఇది పైలట్‌కు రెండో వివాహం. అతని మొదటి భార్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ద్వారా ఓ కుమారుడు ఉన్నాడు. భార్య వివాహానికి అంగీకరించినప్పుడు, తనకు పిల్లలు పుట్టకుండా ఉండాలని ,పైలట్ కుమారుడిని చూసుకోవాలని షరతు విధించాడు.
వివాహం తర్వాత వివాదాలు మొదలయ్యాయి. భర్త తమ ఇంటి ప్రతి గదిలో సీసీటీవీ కెమెరాలు . బాత్‌రూమ్‌లో మైక్రోఫోన్‌లు అమర్చాడు. భార్య చేసే ప్రతి పని మీద నిఘా పెట్టాడు. వివాదాలు పెరిగి పోలీసుల వరకు వెళ్లాయి. 2015 జులైలో భార్య అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చేసింది. రెండు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నుండి వారు విడివిడిగా ఉంటున్నారు. భర్త విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు. అయితే భార్య కలిసి జీవించడానికి (కంజుగల్ రైట్స్) పిటిషన్ దాఖలు చేసింది. అహ్మదాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టు మొదట డివోర్స్ పిటిషన్‌ను తిరస్కరించింది. భార్య తాను పిల్లలను కనే హక్కును త్యాగం చేసిందని కోర్టు భావించింది. తీర్పును గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు.
అయితే గుజరాత్ హైకోర్టు భర్త క్రూరమైన ప్రవర్తన కారణంగా భర్తకు విడాకులు మంజూరు చేసింది. భర్తను భార్యకు జీవితకాలం రూ.1 లక్ష నెలవారీ పర్మనెంట్ భరణం చెల్లించాలని ఆదేశించింది. భర్త ప్రతి గదిలో సీసీటీవీ, బాత్‌రూమ్‌లో మైక్రోఫోన్‌లు అమర్చడం మానసిక క్రూరత్వానికి ఆధారంగా కోర్టు గుర్తించింది. వారు కలిసి ఉండటం కొనసాగిస్తే క్రూరత్వం కొనసాగుతుందని కోర్టు అభిప్రాయపడింది. వారి మధ్య ఉన్న శత్రుత్వం, బహుళ వివాదాల వల్ల మళ్లీ బంధం ఉండదని కోర్టు భావించింది. ఈ కేసులో భర్త , భార్య కలిసి జీవించడం కొనసాగిస్తే ఇద్దరిపైనా క్రూరత్వాన్ని కొనసాగించడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సీసీటీవీ , మైక్రోఫోన్‌లు అమర్చానని భర్త అంగీకరించాడు, కానీ కుటుంబ సభ్యుల భద్రత కోసమని చెప్పాడు. కానీ కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. ఈ కేసు మానసిక క్రూరత్వం, వివాహ సమస్యలపై ముఖ్యమైన తీర్పుగా నిలుస్తుందని భావిస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో విడాకుల కేసుల్లో భరణం అంశం కీలకంగా మారింది. మహిళలు.. మగవాళ్లు భరించలేనంతగా భరణం అడుగుతున్నారు. ఇలాంటివి వైరల్ అవుతున్నాయి.