Guinness World Record: ఎవరూ సాధించలేని ఘనతలు సాధిస్తే గిన్నిస్ రికార్డ్ ఇస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకే రోజులో ఎక్కువ పబ్‌లు సందర్శించి, మద్యం సేవించిన ఓ వ్యక్తికి గిన్నిస్ రికార్డ్ వచ్చింది తెలుసా? ఏంటి దీనికి కూడా గిన్నిస్ రికార్డ్ ఇస్తారా? అని సందేహపడకండి.. నిజంగానే ఇచ్చారు.
ఇదీ సంగతి
ఒకే రోజులో అత్యధిక బార్‌లను సందర్శించి మెల్‌బోర్న్‌కు చెందిన దక్షిణాఫ్రికా సంతతి వ్యక్తి హెన్రిచ్ డి విలియర్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పాడు. 24 గంటల్లో అతను 78 వేర్వేరు పబ్‌లను సందర్శించి ఈ ఘనతను సాధించాడు. పబ్‌లను సందర్శిస్తే చాలదు.. అక్కడ మద్యం కూడా సేవించాలి. అయితే పీకల వరకు తాగకూడదు.
ఇదీ రూల్
ఒక్కో పబ్బులో 125 ఎమ్‌ఎల్ మాత్రమే మద్యం తాగాలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రూల్. దీన్నే 'పబ్ క్రాల్' అంటారు. అంత తాగినా తరువాత కూడా అతను స్టడీగా ఉన్నాడా? అలా ఉండేందుకే తనకు సహాయంగా తమ్ముడు రువాల్డ్ డి విలియర్స్‌ను, ఫ్రెండ్ వెస్సెల్ బర్గర్‌ను వెంట బెట్టుకు వెళ్లాడు.
అయినా సరే 24 గంటల్లో 78 పబ్బులకు వెళ్లడమంటే.. సాధారణ విషయం కాదు. రికార్డు కోసం మెల్‌బోర్న్‌లోని బార్స్ గురించి బాగా రీసర్చ్ చేసి, ముగ్గురూ పక్కాగా రూట్‌మ్యాప్ ప్లాన్ చేసుకున్నారు. జీపీఎస్ ట్రాకింగ్‌తో గమ్యస్థానాన్ని చేరుకుని ఈ రికార్డ్ బ్రేక్ చేశారు.