Watch Video:
తీవ్ర ఆగ్రహం..
ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఎమ్మెల్యే రోడ్ కాంట్రాక్టర్‌ను తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "దీన్నెవరైనా రోడ్డంటారా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఘాజిపూర్‌లో జరిగిందీ ఘటన. సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ లీడర్ ఎమ్మెల్యే బేడి రామ్ కాంట్రాక్టర్‌పై చిందులు తొక్కారు. ఆ రోడ్డుపై ఊరికే అలా పోసి ఉంచిన డాంబర్‌ను కాలితో తంతూ కాంట్రాక్టర్‌పై మండి పడ్డారు. "దీన్ని రోడ్డు అంటారా..? దీనిపై కార్ వెళ్తుందా..? రోడ్డు వేయడం అంటే జోక్‌గా ఉందా?" అంటూ తిట్టారు. అప్పటికే ఆ ఏరియాలో రోడ్ క్వాలిటీపై ఎమ్మెల్యేకి ఫిర్యాదులందాయి. వెంటనే ఆకస్మిక తనిఖీలు చేశారు. అలా షూ తో క్వాలిటీ టెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితమే ఈ రోడ్డుని నిర్మించినట్టు స్థానికులు చెబుతున్నారు.
"పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులెవరూ నేను వెళ్లినప్పుడు లేరు. అందుకే నేను కాంట్రాక్టర్‌పై అరవాల్సి వచ్చింది. సీనియర్ అధికారులకు ఇదే విషయం చెప్పమని వార్నింగ్ ఇచ్చాను. రోడ్డు అస్సలు బాలేదు. ప్రమాణాల ప్రకారం వేయలేదు. కనీసం ఆర్నెల్లు కూడా ఉపయోగించుకోడానికి వీల్లేని విధంగా రోడ్డు వేశారు"
- బేడి రామ్, సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే