Gautam Adani Offers Prayers At Prayag Sangam Serves Meals To Devotees At Maha Kumbh Mela: అదానీ గ్రూపు చైర్మన్  గౌతమ్ అదానీ ప్రయాగరాజ్‌లోని మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఇస్కాన్ ప్రాంగణంలోని  మహాప్రసాద్ సేవా కిచెన్‌లో వంట చేయడంలో సహాయం చేశారు. ఆహారం తయారు చేయడంలో సహాయం చేసిన తర్వాత యాత్రికులకు ప్రసాదాన్ని కూడా వడ్డించారు. తరువాత తన కుటుంబంతో కలిసి మహాప్రసాదాన్ని స్వీకరించారు.  

కుటుంబ సమేతంగా  పండితులతో కలిసి గంగా పూజలో పాల్గొన్నారు. హనుమాన్  ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రార్థనలు  చేశారు. మహా కుంభమేళాను సందర్శించే భక్తులకు భోజనం వడ్డించడానికి అదానీ గ్రూప్ ,ఇస్కాన్  ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ కలసి పని చేస్తున్నాయి.   అన్నపూర్ణ మాత ఆశీస్సులతో లక్షలాది మందికి ఉచిత ఆహారం అందిస్తామని కుంభమేళా ప్రారంభానికి ముందు అదానీ తెలిపారు.  

 కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. కుంభమేళా పూర్తయ్యేంత వరకూ అదానీ గ్రూపు తన ఆహా ర వితరణ కొనసాగిస్తుంది.  మహాకుంభమేళాకు లక్షల సంఖ్యలో  భక్తులు హాజరవుతున్నారు. ఈ కారణంగా అక్కడికి వచ్చే వారందరికీ  ఆహారం లభించడం అంత తేలిక కాదు. భక్తుల కడుపు నింపడం అంటే.. దేవుని సేవ చేసినట్లేనని నమ్మతుున్న పలు సంస్థలు తమ శక్తి మేర ఉచిత ఆహార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి.  దాతృత్వ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసుకున్న అదానీ గ్రూపు.. భక్తుల ఆకలి తీర్చడం ద్వారా భగవంతుని సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఇలాంటి  భోజన సదుపాయాలు అందించడంలో ఇస్కాన్  కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే ఆ సంస్థ సహకారంతో ఈ అన్న ప్రసాద యజ్ఞాన్ని తలపెట్టాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే విజయవంతంగా ప్రారంభించారు. కుంభమేళా అయిపోయే వరకూఈ అన్న ప్రసాద వితరణ కొనసాగుతుంది.